Featured

పుష్పగిరి పీఠాధీశ్వరులు ఆవిష్కరించిన పురాణపండ ‘ఆనంద నిలయం’

క్రమపాఠీలు, ఘనపాఠీలు, సలక్షణ ఘనపాఠీలు… ఇలా ఎందరో వేదనిధుల్లాంటి వందకు పైగా వివిధ ఆలయాల, వివిధ వేద పాఠశాలల వేదపండితులు రవీంద్ర భారతిలో చేసిన వేదగానంతో ఆ ప్రాంతమంతా పవిత్రంగా ప్రతిధ్వనించడం ఒక అద్భుతమైతే.. ఈ శ్రీ కార్యంలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనాలు ‘దేవీం స్మరామి’, ‘ఆనంద నిలయం’ రెండింటినీ ప్రసన్న మూర్తులైన తేజశ్శాలి, తరతరాల సంప్రదాయ సంస్కృతీ పరిరక్షణ పీఠమైన పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శంకరభారతీ నృసింహ స్వామి ఆవిష్కరించడం మరొక అత్యద్భుత ఘట్టంగా చెప్పక తప్పదు.

జంట నగరాలలోనే కాకుండా విదేశాలలోసైతం ఎంతో పేరు ప్రతిష్టలున్న అజాత శత్రువు, సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె. వి. రమణాచారి అధ్యక్ష స్థానంలో సమర్ధవంతంగా, సంప్రదాయ విలువలమధ్య సుమారు రెండు గంటలపాటు నడిచిన ఈ మహోత్తమ కార్యం ప్రముఖ సాంస్కృతిక పారమార్ధిక సంస్థ ‘సత్కళా భారతి’ సంస్థాపకులు సత్యనారాయణ పర్యవేక్షణలో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ సంబరంగా జరగడం ఒక ప్రాధాన్యతగా నగర పండితలోకం బాహాటంగా చెప్పుకోవడం గమనార్హం. వేద ధ్వనులతో రవీంద్ర భారతిని తన్మయింప చేసిన వేదపండితులందఱకు ప్రముఖ వస్త్ర వ్యాపారసంస్థ ఆర్‌ఎస్ బ్రదర్స్ అధినేతలు ఎస్. రాజమౌళి, వెంకటేశ్వర్లు పురాణపండ శ్రీనివాస్ లావణ్య భరితమైన గ్రంధాలను, నూతన వస్త్రాలతో కొంత నగదును బహుకరించారు.

కొందరు వేదపండితులకు బుక్స్ అందకపోవడంతో నిర్వాహకులను అడగగా.. ఎక్కువ స్పందన రావడంతో కొందరు పండితులు నాలుగైదు సెట్లు చొప్పున పురాణపండ బుక్స్‌ని ఎంతో ఆసక్తితో అడిగిమరీ తీసుకున్నారని చెప్పడం.. ఈ పవిత్ర కార్యంలో ఈ చక్కని పుస్తకాలు అందడానికి ప్రధాన సూత్రధారైన రమణాచారికి అందరూ ధన్యవాదాలు తెలిపారు.

ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణవేదాలను విడి విదిహా ఎంతో శ్రావణ సుభగంగా గానం చేసిన పండిత బృందాలకు పుష్పగిరి పీఠాధిపతి ఎంతో భక్తిమయంగా ఆప్యాయతతో మంగళాశాసనాలు చేశారు. పురాణపండ శ్రీనివాస్ అమోఘ గ్రంధాలను ఆసక్తిగా పరిశీలించి అభినందించారు. కార్యక్రమం ఆద్యంతం రమణాచారి నడిపించిన తీరు ఎంతో సంప్రదాయబద్ధంగా, పూజ్యభావంతో సాగడం విశేషం. ఈ కార్యక్రమంలో అతిధిగా తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి దోమోదర్ గుప్తా పాల్గొని ఇలాంటి మహత్తర కార్యంలో పాలుపంచుకునే భాగ్యం నాకు కలగడం ఎన్ని జన్మల పుణ్యమో అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నిర్మాత వివేక్ కూచిభొట్ల, ప్రముఖ పారిశ్రామికవేత్త వేదుల సుదర్శన్ రావుల సమర్పణలో ఈ ఆనంద నిలయం, దేవీం స్మరామి గ్రంధాలు ప్రచురించబడ్డాయని, సౌజన్య సహకారం అందించిన ఆర్ బ్రదర్స్ అధినేతలు రాజమౌళి, వెంకటేశ్వర్లు‌లను నిర్వాహకులు ప్రశంసలతో ముంచెత్తారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM