పాల గ్లాస్ అనుకున్నారా?.. కాదు కల్లు గ్లాస్!! singer sunitha takes palm wine
సింగర్ సునీత.. ఈమె తెలియని వారుండరు. ఎందుకంటే తన అందమైన గాత్రంతో ఎందరినో మైమరపించి, మంత్రముగ్దుల్ని చేసేసింది. సంప్రదాయమైన చీరకట్టుతో ఎప్పుడు నవ్వుల పువ్వులు పూయిస్తూ ఆకట్టుకుంటుంది. ఎన్నో అద్భుతమైన పాటలు ఈమె సొంతం. ఈమధ్యే ఈమె రెండవ పెళ్లి చేసుకుని మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. పెళ్లి తరువాత ఈమెలో ఉన్న జోష్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ మధ్య తరచూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఇంకాస్త దగ్గరయ్యి తన భర్త, మ్యారేజ్ తరువాత తాను ఎంత సంతోషంగా ఉందో తన ప్రేక్షకులతో పంచుకుంటుంది. అటువంటిదే తాజాగా మరో విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకుంది.
అదేమిటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రగతి రిసార్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఓ చల్లని పానీయం ఉన్న గ్లాస్ తో ఫొటోలకి ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పానీయం పాలో, మజ్జిగో అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అది స్వచ్ఛమైన తాటి కల్లు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు గాయత్రీ భార్గవి, మరి కొందరు తనతో పాటు కల్లు గ్లాసులతో కనిపించారు.
ఈ వెచ్చటి వేసవి కాలంలో చల్లటి తాటి కల్లు తాగడం అనేది చాలా ప్రదేశాలలో జరుగుతూనే ఉంటుంది. కానీ ఇలా సెలబ్రిటీలు కల్లు గ్లాసులతో కనిపించటం అనేది మాత్రం విచిత్రమే. అసలు ఇంతకీ ఆ కల్లుని సునీత అండ్ టీం తాగారా లేదా అనేది సెకండ్ థింగ్. కానీ ఇలా గ్లాసులతో దర్శనమిస్తే ఇంకేముంది గోరంతని కొండంత చేసే మన సోషల్ మీడియా మాత్రం తాగారనే చెబుతుంది. అదీ అసలు సంగతి. మరికొందరైతే.. కొత్తగా పెళ్లి అయినా ఈ అమ్మడి చేతిలో పాల గ్లాసు కనిపించాలి కానీ.. ఇలా కల్లు గ్లాస్ ఏమిటి? అనే వారు కూడా లేకపోలేదు.. ఏదిఏమైతేనేం.. ప్రస్తుతం ఈ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…