Featured

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిరానికి విరాళల వెల్లువ

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే..
శ్రీరామ నామం మధురం.. మహానందభరితం..
అటువంటి శ్రీరామునికి అయోధ్యలో మందిర నిర్మాణం జరుగుతోంది. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర తలపెట్టిన ఈ రామ మందిర నిర్మాణంలో నేను భాగమవుతానంటూ పలువురు ప్రముఖులు విరాళాలను అందజేస్తున్నారు. ప్రముఖులే కాదు.. సామాన్య ప్రజలు సైతం రామ మందిరం నిర్మాణంలో భాగస్వాములవుతూ.. వారికి తోచినంతగా విరాళాలు అందజేస్తున్నారు.

ఇప్పటి వరకు ఎందరో ప్రముఖులు విరాళాలను అందజేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రూ. 30 లక్షల రూపాయలను రామ మందిర నిర్మాణానికి విరాళంగా ప్రకటించారు. ఆయనతో పాటు ఆయన కార్యవర్గం కూడా రూ. 11 వేలు విరాళంగా అందజేసినట్లుగా పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే తెలంగాణ గవర్నర్ తమిళ సై ఒక లక్ష ఒక రూపాయిని రామ మందిర నిర్మాణానికి విరాళంగా అందజేశారు. ఇంకా పలువురు బిజేపీ నేతలు విరాళాలు ఇవ్వడమే కాకుండా.. తెలంగాణ రాష్ట్రంలో విరాళాలు సేకరిస్తున్నారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రూ. 10 వేలు విరాళంగా అందజేశారు. ఎంపీ సుజనా తన కుటుంబం తరుపున రూ. 2కోట్ల 2లక్షల 32 వేలు విరాళంగా ఇచ్చారు. కామినేని శ్రీనివాస్ రూ. 5లక్షలు, సీసీఎల్ గ్రూప్ రూ. 6 కోట్ల 39 లక్షలు, సిద్ధార్థ అకాడమీ రూ. 15 లక్షల విరాళం రామ మందిర నిర్మాణానికి ఇచ్చారు. దాదాపు రెండు లక్షల మంది నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అంచనాలకు మించి విరాళాలు అందుతున్నాయని రామజన్మ భూమి నిధి అభియాన్ బృంద కన్వీనర్ బందారి రమేష్, కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM