వైవిధ్యమైన జోనర్స్ కథాంశాలతో సినిమాలు చేయటానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఈ టాలీవుడ్ స్టార్ ప్రతీ సినిమాకు తన విలక్షణతను చూపిస్తూనే వస్తున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు సినిమాను తెరకెక్కించారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌లో గూజ్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25న గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్, సాంగ్ రిలీజ్ తర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.
తాజాగా ‘గాండీవధారి అర్జున’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 18 నిమిషాలుగా మేకర్స్ ఈ సినిమా రన్‌టైమ్‌ను లాక్ చేశారు. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు సినిమాలోని మంచి మెసేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. నాజర్, విమలా రామన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నటీనటులు నటన, సాంకేతిక నిపుణుల ప్రతిభ ప్రేక్షకులకు ఓ అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. యూనిక్ స్టోరీలతో సినిమాలను డైరెక్ట్ చేసే బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు తనదైన పంథాలో ‘గాండీవధారి అర్జున’ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గానే కాకుండా ప్రేక్షకులకు మంచి ప్రభావాన్ని చూపేలా తెరకెక్కించారు.
ప్రపంచ వ్యాప్తంగా ‘గాండీవధారి అర్జున’ ఆగస్ట్ 25న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.
అరమరికలొద్దు. అపోహలొద్దు. అనుమానాలొద్దు. అసూయలొద్దు. అహంకారాలొద్దు. బ్రాహ్మణుడు క్షేమంకరమైన భావాలతో సంచరిస్తేనే అపూర్వాలు సమాజానికి అందుతాయంటూ చాలా చక్కగా ప్రముఖ…
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్ (అదిత్ అరుణ్) హీరోగా, హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్ పతాకంపై…
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యుజ్…
క్రమపాఠీలు, ఘనపాఠీలు, సలక్షణ ఘనపాఠీలు... ఇలా ఎందరో వేదనిధుల్లాంటి వందకు పైగా వివిధ ఆలయాల, వివిధ వేద పాఠశాలల వేదపండితులు…
తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…
కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…