health benefits of cinnamon, నిద్రపట్టడం లేదా.. అయితే ఇలా చేయండి
మన ఇంటిలో వాడే కొన్ని వస్తువులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని, వాటితో ఎన్ని ఉపయోగాలు ఉంటాయని కొందరికే తెలుసు. తెలియనివాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరి కోసం మన ఇంటిలో విరివిగా వాడే ఓ సుగంధ ద్రవ్యమైన దాల్చిన చెక్క ఉపయోగాలు చెప్పే ప్రయత్నమే ఇది. దాల్చిన చెక్క యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే 41 సమ్మేళనాల వల్ల మానవ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్న మానవుడిని తీవ్రంగా వేధిస్తున్న సమస్య అయినటువంటి నిద్రలేమిని ఇది తగ్గిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. దాల్చిన చెక్కను వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మచ్చుకు కొన్ని తెలుసుకుందాం.
– దాల్చిన చెక్క పొడిని రోజూ రాత్రిపూట పాలల్లో కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరగటమే కాకుండా, మెదడు చురుకుగా పని చేస్తుంది. ఇది చిన్న పిల్లలికి మంచి ఫలితాన్నిస్తుంది.
-చిన్నపిల్లలకి మాటలు త్వరగా రావాలంటే దాల్చిన చెక్క రసాన్ని రోజూ తాగిస్తే మాటలు త్వరగా వస్తాయి.
-దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం కలిపి మొటిమలు ఉన్న చోట రాస్తే త్వరలో అవి తగ్గిపోతాయి.
-ఈ దాల్చిన చెక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కు కూడా చాలా చక్కగా పని చేస్తుంది.
-రోజూ రాత్రిపూట ఈ పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి, తేనెతో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమికి ఇదే సరైన ఔషధం.
-వారానికి రెండు సార్లు ఈ పొడిని పాలతో కానీ, నీటితో కానీ కలిపి తీసుకున్నట్లయితే టైప్ 2 షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.
ఇవే కాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఈ సుగంధ ద్రవ్యంలో ఉన్నాయి. రక్తప్రసరణ మెరుగుపరచడంలో ఇది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఒక్కటేమిటీ క్షుణ్ణంగా తెలుసుకుంటే.. దాల్చిన చెక్క ఓ అద్భుత ఔషధం అని అంతా అంగీకరించక మానరు. మరో అప్‌డేట్‌లో ఈ దాల్చిన చెక్కకు సంబంధించిన మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…