Health

Cinnamon Benefits: నిద్రపట్టడం లేదా.. అయితే ఇలా చేయండి

మన ఇంటిలో వాడే కొన్ని వస్తువులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని, వాటితో ఎన్ని ఉపయోగాలు ఉంటాయని కొందరికే తెలుసు. తెలియనివాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరి కోసం మన ఇంటిలో విరివిగా వాడే ఓ సుగంధ ద్రవ్యమైన దాల్చిన చెక్క ఉపయోగాలు చెప్పే ప్రయత్నమే ఇది. దాల్చిన చెక్క యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే 41 సమ్మేళనాల వల్ల మానవ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్న మానవుడిని తీవ్రంగా వేధిస్తున్న సమస్య అయినటువంటి నిద్రలేమిని ఇది తగ్గిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. దాల్చిన చెక్కను వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మచ్చుకు కొన్ని తెలుసుకుందాం.

– దాల్చిన చెక్క పొడిని రోజూ రాత్రిపూట పాలల్లో కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరగటమే కాకుండా, మెదడు చురుకుగా పని చేస్తుంది. ఇది చిన్న పిల్లలికి మంచి ఫలితాన్నిస్తుంది.
-చిన్నపిల్లలకి మాటలు త్వరగా రావాలంటే దాల్చిన చెక్క రసాన్ని రోజూ తాగిస్తే మాటలు త్వరగా వస్తాయి.
-దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం కలిపి మొటిమలు ఉన్న చోట రాస్తే త్వరలో అవి తగ్గిపోతాయి.
-ఈ దాల్చిన చెక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కు కూడా చాలా చక్కగా పని చేస్తుంది.
-రోజూ రాత్రిపూట ఈ పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి, తేనెతో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమికి ఇదే సరైన ఔషధం.
-వారానికి రెండు సార్లు ఈ పొడిని పాలతో కానీ, నీటితో కానీ కలిపి తీసుకున్నట్లయితే టైప్ 2 షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

ఇవే కాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఈ సుగంధ ద్రవ్యంలో ఉన్నాయి. రక్తప్రసరణ మెరుగుపరచడంలో ఇది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఒక్కటేమిటీ క్షుణ్ణంగా తెలుసుకుంటే.. దాల్చిన చెక్క ఓ అద్భుత ఔషధం అని అంతా అంగీకరించక మానరు. మరో అప్‌డేట్‌లో ఈ దాల్చిన చెక్కకు సంబంధించిన మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM