హీరో సుహాస్ నటిస్తున్న 'ఓ భామ అయ్యో రామా' చిత్ర గ్లిమ్స్ విడుదల Hero Suhas Oo Bhaama Ayyo Raama Movie Glimpse Released
సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ గోదాల దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మనోజ్ తనకు జంటగా నటిస్తున్నారు.
ఇక ఈ చిత్ర గ్లింప్స్ వీడియో విషయానికి వస్తే ఈ చిత్రంలోని హీరో హీరోయిన్ ఒక కారులో ఒకరిని ఒకరు టీస్ చేసుకుంటూ సరదాగా ఉన్న సమయంలో కార్ బ్రేకులు పనిచేయక ఆ పరిస్థితి మారిపోయి మరో దిశగా పరిస్థితులు వెళ్తుంటాయి.
వి ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మాతగా గొప్ప నిర్మాణ విలువలతో రానున్న ఈ చిత్రానికి నువ్వు నేను చిత్ర నటి అయిన అనిత హస్సనందిని చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రంలో కామెడీ పండించడానికి ప్రభాస్ శ్రీను, ఆలీ నటిస్తుండగా ఇటీవల యానిమల్ సినిమాలో కనిపించను నటుడు బబ్లు పృథ్వీరాజ్ ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి రాదన్ సంగీతాన్ని అందిస్తుండగా మణికంఠం ఎస్ సినిమాటోగ్రఫీ చేస్తూ భవిన్ షా ఎడిటింగ్ చేయనున్నారు. అంతేకాక ఎందరో అనుభవజ్ఞులు ఈ చిత్రానికి సాంకేత బృందంగా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు : సుహాస్, మాళవిక మనోజ్, అనిత హసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితరులు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…