Latest

ఆటోలో బతికేస్తున్న 74 ఏళ్ల వృద్ధుడు.. ఆరా తీస్తే కన్నీరు పెట్టించే కథ..

ఇళ్లలో ముసలి వాళ్లకు మనుమలంటే చాలా ప్రేమ ఉంటుంది. మనవళ్లు, మనుమరాళ్ల కోసం ఎంత పెద్ద త్యాగం చేయడానికైనా వాళ్లు వెనుకాడరు. సరిగ్గా ఇలాంటిదే తన మనుమరాలి కలలను నిజం చేయడం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన ఓ తాతయ్య కథ తాజాగా వెలుగు చూసింది. ఈ కథ తెలిసిన అనేక మంది మనసులు చలించాయి. మానవత్వం పెళ్లుబికింది. దీంతో వాళ్లంతా ఆ తాతయ్యకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. బిజీ బిజీ జీవితాల్లో ఇంట్లో వాళ్లనే పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండటం లేదనే మాటలను తప్పు అని నిరూపిస్తూ.. కాంక్రీట్ జంగిల్స్‌లా మారిన సిటీల్లో కూడా స్పందించే హృదయం గల దాతలు ఉన్నారని నిరూపించారు. వీరికి వారధిగా ‘హ్యూమన్స్ ఆఫ్ బోంబే’ నిలిచింది.

‘హ్యూమన్స్ ఆఫ్ బోంబే’ ఫేస్‌బుక్ పేజ్‌లో దేశ్‌రాజ్ (74) అనే ఓ తాతయ్య కథను ప్రచురించారు. తన మనుమరాలి కలను సాకారం చేయడం కోసం ఆయన చేసిన త్యాగం ఏంటో చక్కగా వివరించారు. దీంతో అనేక మంది మానవత్వంతో స్పందించి, విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో మొత్తం మీద ఆయనకు రూ.24 లక్షల వరకు విరాళాలు లభించాయి.

దేశ్‌రాజ్ ఓ ఆటో డ్రైవర్. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిద్దరూ మరణించారు. దీంతో తన భార్య, కోడలు, మనుమలను ఆయనొక్కరే పోషిస్తున్నారు. ఆయన మనుమరాలికి కాలేజి చదువులు చదవాలనే బలమైన కోరిక ఉంది. తమ కుటుంబంలో కనీసం ఒకరైనా గ్రాడ్యుయేట్ అవ్వాలని, టీచర్ అవ్వాలని దేశ్‌రాజ్ కూడా కోరుకున్నారు. కానీ ఆయన స్థోమత దానికి సరిపోలేదు.

గత ఏడాది 12వ తరగతి పరీక్షల్లో దేశ్‌రాజ్ మనుమరాలికి 80 శాతం మార్కులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన ఆయన సంతోషానికి హద్దులు లేవు. ఆమెను పెద్ద చదువులు చదివించాలని గట్టిగా నిర్ణయించుకుని, ఇంటిని అమ్మేశారు. ఉండటానికి చోటు లేకపోవడంతో తన భార్య, కోడలు, మనుమలను స్వగ్రామంలోని బంధువుల ఇంటికి పంపించారు. తను మాత్రం ముంబైలో ఆటోలోనే కాలం గడుపుతున్నారు.

దేశ్‌రాజ్ కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సుమారు రెండు లక్షల లైక్స్, వేలాది షేర్లు వచ్చాయి. దీన్ని చదివిన దాతలు విరాళాల రూపంలో రూ.24 లక్షలు ఇచ్చారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. దీంతోనైనా ఆయన కష్టాలు తీరతాయని కోరుకుందాం.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM