Latest

Krack Review: ‘క్రాక్’ మూవీ రివ్యూ

చిత్రం: క్రాక్
నటీనటులు: రవితేజ, శృతిహాసన్, సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్, అలీ, పోసాని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి అప్సర రాణి, రవి శంకర్ తదితరులు
సంగీతం: ఎస్.ఎస్. థమన్
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
సినిమాటోగ్రఫర్: జి. కె. విష్ణు
ఎడిట‌ర్‌: నవీన్ నూలి
నిర్మాత‌: ఠాగూర్ మధు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని

మాస్ రాజా రవితేజ సినిమా వస్తుంది అంటే.. చాలు అది హిట్టా.. ఇంకోకటా అనేది ఆలోచించరు. తప్పకుండా చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. రవితేజ ఎనర్జీ లెవల్ అలా ఉంటాయి. అందులోనూ ఆయన పోలీస్ ఆఫీసర్‌గా అంటే.. ఖచ్చితంగా తిరుగులేని సినిమా అనే అనుకోవాలి. ఇక సంక్రాంతి బరిలో మొట్టమొదటిగా ‘క్రాక్’తో దిగిన రవితేజ.. బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ను సొంతం చేసుకున్నాడో చూద్దాం. విడుదల విషయంలో కన్ఫ్యూజ్ చేసి క్రాక్ ఎక్కించిన రవితేజ.. విడుదల తర్వాత ఏ విధమైన ఫీడ్ బ్యాక్ అందుకున్నాడో మన సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
వీర శంకర్ (రవితేజ) అనే ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్ వేరు వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో ఎలా ఆడుకున్నాడు. ఆ ముగ్గురు నేరస్తులు ఎలా రవితేజకు కనెక్ట్ అయ్యారు అనేది ఇందులో మెయిన్ కథాంశం. 50 రూపాయల నోటు, మామిడికాయ, మేకు.. ఈ మూడు ముగ్గురు నేరస్థులను ఎలా రవితేజకి కనెక్ట్ చేశాయి. ఇందులో కాస్త స్ట్రాంగ్ నేరస్తుడైన కటారి కృష్ణ (సముద్రఖని)కి, వీర శంకర్‌కి మధ్య అసలు ఏం జరిగింది? ఎందుకు వీర శంకర్‌ని చంపాలనుకుంటాడు? యోగా క్లాస్‌లో కలిసిన శృతిహాసన్.. రవితేజ భార్య ఎలా అయింది. మధ్యలో జయమ్మ(వరలక్ష్మీ) ఎవరు? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:
సినిమా అంతా రవితేజ చుట్టూనే తిరుగుతుంటుంది. ప్రతి సీన్‌లో రవితేజ మెప్పిస్తాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ‘విక్రమార్కుడు’లోని విక్రమ్ రాథోడ్ సింగ్ కనిపిస్తాడు. రవితేజకు సరైన క్యారెక్టర్ పడితే.. ఎలా రెచ్చిపోతాడో.. అలా ఈ సినిమాలో ఓ అద్భుతమైన పాత్రలో జీవించేశాడు. శృతిహాసన్ పాత్ర గురించి చెప్పే కంటే.. సినిమాలో చూస్తేనే మజా వస్తుంది. ఇరగదీసింది అంతే. అలాగే కటారి కృష్ణగా సముద్ర ఖని, జయమ్మగా వరలక్ష్మీకి చాలా మంచి పాత్రలు పడ్డాయి. అంతే చక్కగా వారు కూడా మెప్పించారు. బుల్లితెర కమెడియన్స్, అలీ, సుధాకర్ కోమాకుల, వంశీ ఇలా అందరికీ మంచి పాత్రలు దక్కాయి. వారి పాత్రల పరిధిమేర సినిమాకు వారి నటనతో బాగా హెల్ప్ అయ్యారు.

సాంకేతిక నిపుణులు:
సాంకేతిక విభాగానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ గురించే. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుమ్మేశాడు. పాటలన్నీ బాగున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విభాగం డైలాగ్స్. సాయిమాధవ్ బుర్రా పెన్ పవర్ మరోసారి చూపించాడు. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ కూడా మూడ్‌కి తగినట్లుగా చక్కగా డిజైన్ చేశారు. దర్శకుడు గోపీచంద్‌ ఎటువంటి తరహా చిత్రమైనా చేయగలడనేలా ఈ మూవీతో నిరూపించుకున్నాడు. మాస్ సబ్జెక్ట్‌ని.. అంతే మాస్‌గా తెరకెక్కించి మంచి రిజల్ట్ రాబట్టాడు. ఈ సినిమా చూస్తుంటే ఆయన ఎంత కసితో ఈ సినిమా తీశాడో అర్థమవుతుంది. ఒకటి, రెండు సన్నివేశాలు తప్ప.. సినిమా ఎక్కడా పడిపోలేదు. మంచి గ్రాఫ్‌తో సినిమాని లేపాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ:
కథ విషయంలో కాస్త డిజప్పాయింట్‌గా నడిచినా.. స్క్రీన్‌ప్లేతో ఆ లోటుని తీర్చేశాడు దర్శకుడు. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని అన్ని అంశాలను మిక్స్ చేసి.. మెప్పించాడు. కాకపోతే.. అక్కడక్కడా కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. అలాంటి చోట మళ్లీ రవితేజానే సినిమాని నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముగ్గురు విలన్ల నేపథ్యంలో రొటీన్ కథ అనిపించకుండా.. కొన్ని కొత్త ప్రయోగాలు చేయడం కలిసొచ్చింది. లేదంటే.. అంతగా చెప్పుకునే స్టోరీ అయితే ఇందులో ఏమీ లేదు. 50 రూపాయల నోటు, మామిడికాయ, మేకు.. లింక్ చేసిన విధానం బాగుంది. అలాగే రవితేజకి పోటీగా కటారి కృష్ణ, జయమ్మ.. పాత్రలు, పాత్రదారులను గోపీచంద్ ఎంపిక చేసుకోవడం బాగుంది. కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే సినిమా ఇది. మరి కలెక్షన్స్ ఎలా రాబడుతుందో చూడాలి.

‘జస్ట్ టీజర్’ ట్యాగ్‌లైన్: డీజే, ఓజే కాదు.. ఆర్‌జే జాతర.. రవితేజ జాతర
‘జస్ట్ టీజర్’ రేటింగ్: 3/5

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM