మెగాస్టార్.. నువ్వు సామాన్యుడివి కాదు బాస్ | Megastar Chiranjeevi
Megastar Chiranjeevi: ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని ప్రతి చిన్న విషయాన్ని తమ ఫోన్లలో బంధించేస్తున్నారు. అది ఎటువంటి అకేషన్ అయినా సరే, అంటే పుట్టిన రోజు వేడుకైనా, పెళ్లి రోజు వేడుకైనా, పిల్లల నవ్వులు, ఇలా ఎన్నో విషయాలని తమ స్మార్ట్ ఫోన్లలో బంధించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి పంచుతున్నారు. ఇటువంటి వాటిల్లో మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ ముందు వరుసలో ఉంటున్నారు. అందులోను మెగా ఫ్యామిలీ గురించి ముందుగా చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో ముందు ఉంటారు. ప్రకృతి అందాల్ని తన ఫోన్లో బంధించి తన అభిమానులతో వాటిని పంచుకుంటూ ఉంటారు. అటువంటిదే ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో సోమవారం పోస్ట్ చేశారు.
ఇంత పెద్ద సిటీలో సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటివి చూడడానికి ఒక యజ్ఞమే చేయాలి. కానీ చిరంజీవి మాత్రం అప్పుడే ఉదయిస్తున్న సూర్యుణ్ణి కెమెరాలో బంధించారు. అది కూడా స్విమ్మింగ్ ఫూల్ లో ఉదయిస్తున్న సూర్యుణ్ణి వీడియో రూపంలో తన ప్రేక్షకులకి అందించారు. ‘‘ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు గడిచినా.. ఖగోళ అందాలైన సూర్యోదయ, సూర్యాస్తమయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఆ క్షణాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. మా ఇంటి ఆవరణలో ఆవిష్కృతమైన అటువంటి ఓ అందమైన ఉదయాన్ని మీతో పంచుకుంటున్నాను’’ అని తెలుపుతూ.. ఆయన క్యాప్చర్ చేసిన వీడియోని షేర్ చేశారు.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ చేయనున్నారు. అనంతరం మెహర్ రమేష్, బాబీ దర్శకత్వంలో చిత్రాలు సైన్ చేసి ఉన్నారు. త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది. ఇక మెగాస్టార్ షేర్ చేసిన వీడియోని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నువ్వు సామాన్యుడివి కాదు బాస్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…