‘ఎన్టీఆర్ నీల్’.. ఏప్రిల్ 22 నుంచి షూట్ లో పాల్గొంటున్న తారక్ NTR Joins Prashanth Neel NTR Neel Movie Shoot from April 22nd
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకున్న మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కెజియఫ్, సలార్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలను రూపొందించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ యాక్షన్ ఎపిక్ మూవీ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభమైంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రీసెంట్‌గా ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.
ఈ క్రేజీ మూవీ సెట్స్‌లోకి ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా అని అభిమానులు సహా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. ఏప్రిల్ 22 నుంచి షూటింగ్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ పాల్గొంటున్నారు. దీని కోసం ఆయన హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళుతున్నారు. రోజు రోజుకీ ఈ కాంబోపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ చిత్రీకరణలో పాల్గొనబోతుండటంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయ్యింది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయిక వెండితెరపై ఎలాంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుందోనని అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సెట్స్‌లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నారనే వార్త ఆయన అభిమానులు, ప్రేక్షకులకు సరికొత్త ఉత్సాహాన్నిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ యూనిక్ మాస్ విజన్‌తో ఎన్టీఆర్‌ను సరికొత్త మాస్ అవతార్‌లో చూపించబోతున్నారు. ఇది సినీ ఇండస్ట్రీలో సరికొత్త మైలురాయిని క్రియేట్ చేయనుంది.
ఈ ప్రెస్టీజియస్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా… ప్రొడక్షన్ డిజైనర్‌గా చలపతి వర్క్ చేస్తున్నారు. వీరితో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణఉలు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనున్నారు.
నటీనటులు – మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
సాంకేతిక వర్గం :
నిర్మాతలు – కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు
రచన, దర్శకత్వం – ప్రశాంత్ నీల్
సంగీతం – రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ – భువన్ గౌడ
ప్రొడక్షన్ డిజైన్ – చలపతి
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తున్నారు శివాజీ. ఇటీవల విడుదలైన…
వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న కథానాయకుడు…
మిస్టర్ ఎల్రెడ్ కుమార్ నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌లో 16వ ప్రాజెక్ట్‌గా ‘మందాడి’ చిత్రం రానుంది. ఈ…
హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…