Featured

Puranapanda Srinivas: అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘమన్న పురాణపండ

Puranapanda Srinivas: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని, గణపతి ఆలయ దర్శనం, గణపతి మంత్ర పఠనం జీవన వైభవాన్ని అమోఘంగా మారుస్తాయని ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు.

రాయదుర్గంలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ గ్రౌండ్స్ వద్ద ప్రత్యేకంగా నిర్మించిన శ్రీ అభయ గణపతి దేవాలయంలో మూల విరాట్ ప్రతిష్టాపనకు ఆయన వేదవిదుల మంత్ర ధ్వనులమధ్య వైదిక సంప్రదాయానుసారం పూజార్చనలు జరిపారు.

Puranapanda Srinivas

ఈ సందర్భంగా పురాణపండ మాట్లాడుతూ ప్రతికూల శక్తులని పరిహరింప చెయ్యడంలో గణపతి మంత్రశక్తి అపారమైందని చెప్పారు. మూడులోకాలు శరణుజొచ్చె గణపతి భగవానుని ఆలయ ప్రారంభ వేడుకలో పాల్గొనడంతో వొళ్ళు గగుర్పొడుస్తోందని శ్రీనివాస్ పారవశ్యంగా వివరించారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఎమ్. రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలను దూరం చేసే అద్భుతాల అభయ గణపతిని అతి అరుదైన కృష్ణ శిలతో తయారు చేయించిన కాలనీ వాసుల్ని అభినందించారు.

Sri Abhaya Ganapathi Temple Inauguration

ప్రసన్నపుణ్యమైన చైతన్యంతో ఈ ఆలయ ప్రాంగణం, పరిసరాలు శోభిస్తున్నాయని అభయ గణపతి ఆలయ సౌందర్యాన్ని, విశేషాల్ని రమేష్ రెడ్డి చక్కగా వివరించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి ఆలయ కమిటీ పక్షాన ఆలయ ప్రారంభకులు పురాణపండ శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు.

వందలాది భక్తుల సమక్షంలో అపూర్వంగా జరిగిన గణేశ హోమం, ప్రత్యేక పూజల్లో శ్రీ అమృతేశ్వరాలయం సమర్పణలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచించిన సహస్ర అపురూప గ్రంధాన్ని రమేష్ రెడ్డి ఆవిష్కరించి శ్రీనివాస్ నిర్విరామ పవిత్ర కృషిని అభినందించారు.

ఈ శ్రీకార్యంలో శ్రీ అభయగణపతి ఆలయ కమిటీ సభ్యులు జస్టిస్ డి.వి.ఆర్. వర్మ, సీనియర్ ఐఏఎస్ అధికారి విద్యాసాగర్, భాస్కర్ రెడ్డి, రాచకొండ రమేష్ , దాట్ల రవివర్మ, సంజయ్ కమటం, గొర్తి రవి ప్రసాద్, శ్రీనివాస్ రామ్ సాగర్, అమిత్ శర్మ, సందీప్ కమటం, శ్రీధర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

తొలుత శృంగేరికి చెందిన మహా పండితులు ఎన్.ఎస్. శర్మ బృందం సుమారు మూడుగంటలపాటు ఆలయ ప్రతిష్టకు సంబంధించిన మంత్ర భాగాలతో సమస్త వైదిక కార్య కలాపాల్ని సంప్రదాయంగా నిర్వహించడం అందరినీ విశేషంగా ఆకర్షించింది.

కృష్ణ శిలతో ఈ అభయ గణపతి ఆలయాన్ని నిర్మించడంలో శిల్పనైపుణ్యాన్ని ప్రదర్శించిన జయలక్ష్మీ ఆచార్యులను ఐజి. రమేష్ రెడ్డి నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.

Recent Posts

నటనతో హృదయాలు గెలుచుకుంటున్న శివాజీ.. ప్రశంసల వర్షం కురిపించిన సుకుమార్

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తున్నారు శివాజీ. ఇటీవల విడుదలైన…

April 20, 2025 at 9:48 PM

‘ఎన్టీఆర్ నీల్’.. ఏప్రిల్ 22 నుంచి షూట్ లో పాల్గొంటున్న తారక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకున్న మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కెజియఫ్, సలార్…

April 20, 2025 at 9:34 PM

’సోదరా‘ నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది: హీరోలు సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌

వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న కథానాయకుడు…

April 20, 2025 at 9:20 PM

‘మందాడి’ ఫస్ట్ లుక్ విడుదల

మిస్టర్ ఎల్రెడ్ కుమార్ నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌లో 16వ ప్రాజెక్ట్‌గా ‘మందాడి’ చిత్రం రానుంది. ఈ…

April 20, 2025 at 8:44 PM

పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

April 14, 2025 at 8:10 PM

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM