Politics

సీఎస్‌ ఆదిత్యను అభినందిస్తున్నా.. : జగన్

CM Jagan appreciates CS: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. తాడేపల్లిగూడెంలోని క్యాంపు‌ కార్యాలయంలో నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభినందిస్తున్నానని తెలిపారు.

నిజానికి ఇలాంటి సమావేశాలు తరుచూ జరగాల్సి ఉంది. ఎందుకంటే వివిధ శాఖల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతుంది. అంతే కాకుండా పలు అంశాలను నేనే స్వయంగా పరిశీలించి, ఎక్కడైనా సమస్యలు గుర్తిస్తే వాటి పరిష్కారానికి ఆదేశాలు చేయగలుగుతాను. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ఆ శాఖ కార్యదర్శికి తగిన నిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఒక వైపు కాగా, మరొక వైపు ఇలాంటి సమావేశాలు మన ముందున్న పనులు, లక్ష్యాలపై మరోసారి దృష్టి పెట్టే వీలు కలుగుతుంది. అందువల్ల ఎక్కడైనా సమాచార లోపం ఉంటే, వెంటనే దాన్ని అధిగమించవచ్చు. ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకోవచ్చు. తద్వారా ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవచ్చు అని జగన్ తెలిపారు.

నిస్సంకోచంగా చెప్పండి..
ఇక్కడ వివిధ శాఖలకు చెందిన ఎందరో అధికారులు ఉన్నారు. సుపరిపాలన అందించడంలో వారందరికీ ఎంతో అనుభవం ఉంది. అందువల్ల మీ శాఖకు సంబంధించిన అంశం కాకపోయినా సరే, ఫలానా శాఖలో ఫలానా మార్పు చేస్తే ఇంకా సుపరిపాలన అందుతుంది అని మీరు భావిస్తే, ఏ మాత్రం సంకోచించకుండా ముందుకు రండి. స్పష్టంగా మీ అభిప్రాయం తెలియజేయండి. నిస్సందేహంగా మీ సలహాలు అందజేయండి. ఒక మంచి ఆలోచనను ఒక స్పష్టమైన స్ఫూర్తి, నిబద్ధతతో అమలు చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి మీమీ ఆలోచనలను మీ వరకు పరిమితం చేసుకోకుండా, నిస్సంకోచంగా ముందుకు రండి. సుపరిపాలన కోసం మీమీ అభిప్రాయాలు తెలియజేయండి. సూచనలు ఇవ్వండి. వాటి అమలులో ప్రభుత్వం కూడా సంకోచించదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సుపరిపాలననే కోరుకుంటున్నారు. ఇవీ ముఖ్యమైన అంశాలు అని జగన్ చెప్పుకొచ్చారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM