Politics

నేడే కేంద్ర బడ్జెట్‌.. నిర్మలమ్మ లెక్కలు ఎలా ఉంటాయో?

ఒక్క భారతదేశమే కాదు.. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో కుదేలైన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి ఇంకాస్త టైమ్ పట్టే క్రమంలో నేడు (సోమవారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతోన్న 2021-22 బడ్జెట్‌కు ఎంతో ప్రాధాన్యాత నెలకొంది. ఇది బాగుంది, ఇది బాగాలేదు.. అని చెప్పుకోవడానికి వీలు లేకుండా.. అన్ని వ్యవస్థలు నలిగిపోయిన క్రమంలో ఈ బడ్జెట్‌తో ఎటువంటి ఉపశమనం కలిగిస్తారు? లేదంటే ఆర్థిక వ్యవస్థను సెట్ చేయడానికి ఏమేం పన్నులు పెంచబోతున్నారు? అనే ఉత్కంఠ ప్రజలలో నెలకొంది.

ప్రజలను ఇబ్బంది పెట్టేలా కాకుండా.. తిరిగి పుంజుకునేలా చిన్న హోప్ కలిగించేలా బడ్జెట్ ఉండాలని అంతా కోరుకుంటున్నారు. కానీ దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడాలి కాబట్టి.. ఈసారి కూడా కొందరిపై పన్నుల భారం మరింతగా పడేలా బడ్జెట్ ఉందనే వార్తలు అప్పుడే వినిపిస్తున్నాయి. సంవత్సరంగా హెల్త్ విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే కాబట్టి.. ఈ బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.

మరో వైపు కొన్ని రోజులుగా ఆందోళనలో ఉన్న రైతులను కూడా శాంతింపజేసేలా ఈ బడ్జెట్‌లో రైతులకు ప్రాముఖ్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కార్యక్రమానికి కూడా అధికంగా సొమ్ములు కేటాయించే అవకాశం ఉంది. ఒక్కటేమిటి ప్రతీ రంగం నిర్మలమ్మ ప్రవేశ పెట్టబోతోన్న బడ్జెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురచూస్తున్న క్రమంలో.. మూడో సారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నిర్మలమ్మ లెక్కలు ఎలా ఉండనున్నాయో.. మరి కొన్ని గంటల్లో తెలిసిపోనుంది.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM