Categories: CinemaLatestTopStory

రాజమౌళి కొడుకు హిట్ కొట్టాడు

ఈ ఏడాది ఫిబ్రవరి 9న విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి మంచి ప్రశంసలు దక్కాయి. మంచి కామెడీ, లవ్ అనే అంశాలతో ‘ప్రేమలు’ సినిమా స్టోరీ లైన్, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్బుతమని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ అందించారు. శుక్రవారం (మార్చి 8)న విడుదలైన ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో…

దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు. మలయాళంలో ఫిబ్రవరి 9న ‘ప్రేమలు’ సినిమా విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. మలయాళ సినిమా అయినప్పటికీ హైదరాబాద్ లోనే సినిమా షూటింగ్ చేశారు. మన లొకేషన్స్ చిత్రీకరణ జరిగింది. 90 శాతం కథ హైదరాబాద్ లోనే చిత్రీకరణ చేశారు. అక్కడ రిలీజైన ఈ చిత్రాన్ని రాజమౌళిగారి అబ్బాయి ఎస్.ఎస్.కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు అందించాలనుకున్నారు. ఆ క్రమంలో నాతో మాట్లాడితే నైజాంలో నేను రిలీజ్ చేస్తానని చెప్పాను. గురువారం ప్రీమియర్ షోస్ వేస్తే ఒక్కో స్క్రీన్ యాడ్ చేసుకుంటూ పోయాం. మొత్తం పది షోస్ వేశాం. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ స్పందన చూస్తుంటే సినిమా మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులోనూ ఇంతింతై వటుడింతై అన్నట్లుగానే అన్ని ఏరియాల్లో రిలీజై హిట్ అవుతుందనిపిస్తుంది. ఫుల్ ఎంటర్ టైనర్ ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను. ఆదిత్య తెలుగులో డైలాగులను అద్భుతంగా రాశాడు. థియేటర్స్ లో సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఎస్.ఎస్.కార్తికేయ మాట్లాడుతూ ‘‘ప్రేమలు’ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యిందని నాకు తెలియగానే అక్కడి నిర్మాతలను కాంటాక్ట్ అయ్యాను. తెలుగు రిలీజ్ చేయాలనుకుంటున్నానని వారి చెప్పాను. సినిమా మెయిన్ కథంతా హైదరాబాద్ లోనే జరుగుతుంది. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండే సినిమా. నేను మలయాళ నిర్మాతలను సంప్రదించగానే వారు నాకు ఇక్కడ రిలీజ్ చేసే అవకాశం ఇచ్చారు. అందుకు వారికి థాంక్స్. ఆదిత్య ఈ సినిమా డైలాగ్స్ ను 7-8 రోజుల్లో రాసి డబ్బింగ్ చెప్పించేశారు. గొప్పగా సపోర్ట్ చేశారు. వారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు.

ఆదిత్య మాట్లాడుతూ ‘‘ప్రేమలు’ సినిమా చూస్తుంటే మనల్ని మనం చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ప్రతీ క్యారెక్టర్ అందరికీ రిలేట్ అవుతుంది. అందుకనే అలాంటి డైలాగ్స్ రాయాలనిపించి రాశాను. ఈ టీమ్ తో కలిసి పని చేయటం సంతోషంగా ఉంది. చాలా గొప్ప ఎక్స్‌పీరియెన్స్. మీ గ్యాంగ్ తో కలసిి సిినిమా చూడండి రోలర్ కోస్టర్ రైడ్ లా సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు.

Recent Posts

ఇంద్రకీలాద్రిపై ‘దేవీం స్మరామి’.. భాగ్యనగరంలో ‘దుర్గే ప్రసీద’తో ఆకట్టుకున్న పురాణపండ

తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…

October 11, 2024 at 1:09 PM

దేవీచౌక్ అమ్మవారి ఉత్సవాల్లో మెరిసిన పురాణపండ ‘సౌభాగ్య’

కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…

October 6, 2024 at 8:21 PM

‘మార్టిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ముఖ్యాంశాలు

ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌,…

October 5, 2024 at 12:58 PM

రికార్డులు బద్ధలు కొడుతున్న ‘డీమాంటే కాలనీ 2’

నేషనల్‌, అక్టోబర్‌xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్ తో…

October 5, 2024 at 12:29 PM

గోపీచంద్ ‘విశ్వం’ థర్డ్ సింగిల్ వస్తాను వస్తానులే సాంగ్ రిలీజ్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్…

October 5, 2024 at 12:19 PM

ఆలియాభట్‌ “ఆల్ఫా” వచ్చే ఏడాది డిసెంబర్‌ 25న విడుదల!

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్‌ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.…

October 5, 2024 at 12:11 PM