Rana Virata Parvam Release date locked, రానా విరాటపర్వం విడుదల తేదీ ఫిక్సయింది
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేశారు.
ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు, రానా బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, సంక్రాంతి పర్వదినాన రిలీజ్ చేసిన రానా-సాయిపల్లవి జంట పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఇవన్నీ ‘విరాటపర్వం’పై అంచనాలను పెంచి, ఆడియెన్స్‌లో, ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. రానా, సాయిపల్లవి జోడీ చూడచక్కగా ఉందని అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు వచ్చాయి.
ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. తాజాగా రానా, సాయిపల్లవిల పోస్టర్స్‌ను విడివిడిగా విడుదల చేశారు. ఇవి ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ చిత్రానికి సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సమర్పణ: సురేష్ బాబు
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్.ఎల్.వి. సినిమాస్
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
స్టంట్స్: స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర
కొరియోగ్రఫీ: రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ చాగంటి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్: ధని ఏలే.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…