‘టైగర్ నాగేశ్వరరావు’ దండయాత్ర అదిరింది.. Tiger Nageswara Rao Tiger Invasion Begins
ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్ యావత్ దేశాన్ని షేక్ చేశాయి. ఇప్పుడు ది గ్లోరీ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్-టైగర్ నాగేశ్వరరావు గ్లింప్స్ విడుదల అయింది. మాస్ మహారాజా రవితేజ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైగర్ దండయాత్ర (Tiger’s Invasion) టీజర్ ఇప్పుడు విడుదలైంది.
హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, దేశంలోని అనేక ప్రాంతాలలో దొంగతనాలు చేసిన స్టూవర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు మద్రాస్ సెంట్రల్ జైలు నుండి పరారీలో ఉన్నారనే వార్తా కథనంతో టీజర్ ప్రారంభమవుతుంది. మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగకపోవడంతో పోలీసులు షాక్ అవుతారు. టైగర్ జోన్‌లో పనిచేసిన మురళీ శర్మ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా టైగర్ నాగేశ్వరరావులోని అరుదైన నైపుణ్యాలను వివరిస్తారు.
‘’నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్లుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. దురదృష్టవశాత్తు, వాడొక క్రిమినల్ అయ్యాడు” అని మురళీ శర్మ టైగర్ నాగేశ్వరరావు సామర్థ్యాలను వివరిస్తారు.
టైగర్ నాగేశ్వరరావు చిన్నతనంలోనే నేరాలు చేయడం ప్రారంభించడంతో చిన్నప్పటి నుంచి వైల్డ్ స్వభావం కలిగి ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు , ఆర్మీ బెటాలియన్‌ను మోహరించారు, అలాంటి భయం అతను ప్రజలు, ప్రభుత్వంలో కలిగించాడు.
లాస్ట్ పోర్షన్ వరకు అతని ముఖాన్నిచూపించకపోయినా, టీజర్ అంతా అతని ప్రజన్స్ అనుభూతి చెందుతాం. టైగర్ ఎంట్రీ కథనాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. రైలు ఎపిసోడ్ పాత్ర యొక్క ధైర్యాన్ని చూపిస్తుంది.
ఇందులో రవితేజను చూసిన తర్వాత టైటిల్ రోల్‌లో మరే ఇతర స్టార్‌ను మనం ఊహించుకోలేము. ట్రాన్స్ ఫార్మేషన్ చెందడం నుంచి, పాత్రను పోషించడం వరకు రవితేజ ఎక్స్ టార్డినరిగా చేశారు. తన వైల్డ్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. దర్శకుడు వంశీ బ్రిలియంట్ రైటింగ్, అద్భుతమైన దర్శకత్వాన్ని అభినందించాలి. డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
ఆర్ మధి తన కెమెరా పనితనంతో కథనానికి గ్రాండ్‌నెస్ తెచ్చారు. ఇందులో జివి ప్రకాష్ కుమార్ తన అద్భుతమైన స్కోర్‌తో ప్రతి సీక్వెన్స్‌ను ఎలివేట్ చేశాడు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వరుసగా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లను క్రియేట్ చేసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మించారు, నిర్మాణ ప్రమాణాలు లావిష్ గా ఉన్నాయి.
మొత్తానికి టైగర్ దండయాత్ర తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…