Cinema

Amma Deevena: ‘అమ్మదీవెన’ ఉంటే చాలంటోన్న నటి ఆమని

అమ్మ… ఈ సెంటిమెంట్ తెలుగు తెరకు ఎప్పుడు కొత్తదే. అమ్మ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంటుందో.. అమ్మ సినిమాలు కూడా ప్రేక్షకులకు అంతే సంతృప్తిని కలిగిస్తాయి. ఇప్పటి వరకు అమ్మ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలన్ని సెంటిమెంటల్ హిట్స్‌గా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అమ్మ రాజీనామా, మాతృదేవోభవ, యమలీల, తాజాగా బిచ్చగాడు వంటి చిత్రాలు ఎలాంటి విజయాలు అందుకున్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ వస్తున్న చిత్రం “అమ్మదీవెన”. ప్రముఖ నటి ఆమని ముఖ్యపాత్రలో, లక్ష్మి స‌మ‌ర్ప‌ణలో, శివ ఏటూరి దర్శకత్వంలో.. ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎత్తరి మార‌య్య‌, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గుర‌వ‌య్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా నటి ఆమని మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు శివ‌ ఈ కథ చెప్పిన‌ప్పుడు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా చాలా సన్నివేశాలు అందరినీ ఆట్టుకునే విధంగా ఉంటాయి. శుభ‌సంక‌ల్పం తర్వాత ఈ సినిమాలో డీ గ్లామ‌ర్ పాత్ర చేశాను. యుక్త వయసు నుండి వృద్ధాప్యం వరకు ఓ మహిళా చేసే ప్రయాణమే ఈ సినిమా. ఐదుగురు పిల్లల తల్లి వాళ్ళను ప్రయోజకుల్ని చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. సమాజం నుండి ఎదురైన కష్ట నష్టాలను ఎలా అధిగమించింది. తన కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దడం కోసం ఎలాంటి త్యాగాలు చేసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు ఎదిరించి పోరాడాలి కానీ ఆత్మహత్యతో జీవితాన్ని ముగించకూడదు అని చెప్పే మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ కథ మొత్తం నా పాత్ర చుట్టే తిరుగుతుంది. పోసాని కృష్ణ మురళి ఓ వ్యక్తిగా చక్కగా నటించారు. అలాగే దర్శకుడు శివ కూడా చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. తప్పకుండా ఇది అందరికి నచ్చే సినిమా. ‘అమ్మదీవెన’ ఉంటే చాలనుకునేవారందరి సినిమా. నాకు కూడా కెరీర్ పరంగా చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. ఇంత మంచి చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, అప్పుడే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని భావిస్తూ.. చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను..’’ అన్నారు.

ఆమని, పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, డిఎస్ రావు, కావ్య, యశ్వంత్, నాని యాదవ్, అరుణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: జానకిరామ్, డాన్సులు: గణేష్ స్వామి, నాగరాజు, చిరంజీవి, ఫైట్స్: నందు, పి.ఆర్.ఓ.: సాయి సతీష్, పర్వతనేని; మాటలు: శ్రీను. బి, సంగీతం: ఎస్.వి.హెచ్, డిఓపి: సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్, నిర్మాత: ఎత్తరి గుర‌వ‌య్య, దర్శకత్వం: శివ ఏటూరి.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM