Cinema

‘ఎఫ్3’: హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఇంటర్వ్యూ

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్సులుగా అలరిస్తుంటాయి. అలా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం పంచిన పాత్రల్లో బ్లాక్ బస్టర్ హిట్ ‘ఎఫ్2’ లో మెహ్రీన్ పిర్జాదా చేసిన హానీ పాత్ర కూడా ముందు వరుసలో వుంటుంది. హనీ మేనరిజం, అమాయకత్వం, అల్లరి ప్రేక్షకుల మనసుని దోచుకున్నాయి. ఇప్పుడు ఎఫ్2 లో హనీ పాత్రకు భిన్నంగా, ఎఫ్2కి మించిన వినోదం ‘ఎఫ్3’ తో పంచబోతున్నారు మెహ్రీన్. ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్3 లో మెహ్రీన్ పాత్రని మెచ్యూర్ అండ్ డిఫరెంట్ లేయర్స్ వున్న పాత్రగా పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు. ఈ పాత్ర తన కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్‌ట్రైనర్‌ రోల్ కాబోతుందని మెహ్రీన్ నమ్మకంగా వున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ ‘F3’ లో విక్టరీ వెంకటేష్ కి జోడిగా తమన్నా భాటియా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తుండగా సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్ గా అలరించబోతుంది.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలాగే సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ట్రెండింగ్ లో వుంది.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయబోతున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రలలో అలరించనున్నారు.
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.
ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.

తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌవాన్, పూజా హెగ్డే (స్పెషల్ అప్పీరియన్స్) తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత : శిరీష్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సహా నిర్మాత: హర్షిత్ రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
డివోపీ: సాయి శ్రీరామ్
ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్
ఎడిటర్ : తమ్మిరాజు
స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : ఎస్ కృష్ణ
అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM