Cinema

గిరిజన గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందించనున్న ఆదిత్య ఓం

నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరో ఆదిత్య ఓం. తెలంగాణలోని గిరిజన గ్రామమైన చెరుపల్లిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆదిత్య ఓం ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ ప్రజలందరికీ స్వచ్చమైన నీటిని అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆదిత్య ఓం చెరుపల్లి, ఇరుగు పొరుగు గ్రామాల అవసరాలను తీర్చేందుకు RO వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
RO ప్లాంట్ నుంచి వచ్చే స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీటితో అక్కడి ప్రజల సమస్యలు తొలిగిపోనున్నాయి. ఇక నీటి సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా దూరం కానున్నాయి. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరి ప్రజలకు అందించాలని అనుకుంటున్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఆదిత్య ఓం త్వరితగతిన పనులు చేపడుతున్నారు. ఈ మేరకు గ్రామస్తులు ఆదిత్య ఓంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఇటీవలే ఆదిత్య ఓం బిగ్ బాస్ షోలో సందడి చేశారు. సినిమాలతో దగ్గరైన ఆదిత్య ఓం.. ఈ షోతో తెలుగు ప్రజల ఇంట్లోకి కూడా వచ్చేశారు. ఆదిత్య ఓం ప్రస్తుతం ‘బంధీ’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదొక ప్రయోగాత్మక చిత్రమన్న సంగతి తెలిసిందే. పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేలా బంధీ చిత్రం తెరకెక్కుతోంది.

Recent Posts

‘మ్యాడ్ స్క్వేర్’… రెండవ పాట విడుదల

'మ్యాడ్ స్క్వేర్' చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన…

December 28, 2024 at 9:59 PM

గోదారి గట్టు సాంగ్… సరికొత్త రికార్డు

విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చుట్టూ ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవెల్ చేరుకుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్…

December 28, 2024 at 9:54 PM

‘పుష్ప-2’ 21 రోజుల కలెక్షన్ ఎంతంటే?

డిసెంబరు 4న ప్రీమియర్స్‌ షో నుంచే ఇండియన్‌  బాక్సాఫీస్‌పై మొదలైన పుష్పరాజ్ రూల్‌.. రోజు రోజుకి అత్యధిక కలెక్షన్లతో కొనసాగుతోంది.…

December 27, 2024 at 10:13 AM

‘సంక్రాంతికి వస్తున్నాం’లో సంక్రాంతి స్పెషల్ సాంగ్‌ పాడిన విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ 'గురు' సినిమాలో తన ఎనర్జిటిక్ వోకల్స్ తో పాడిన జింగిడి జింగిడి సాంగ్ చార్ట్ బస్టర్ హిట్…

December 27, 2024 at 9:59 AM

సూర్య44 టైటిల్ ‘రెట్రో’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

వెర్సటైల్ స్టార్ సూర్య హైలీ యాంటిసిపేటెడ్ #Suriya44, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు, ఈ సినిమాకి 'రెట్రో' అనే టైటిల్‌ను…

December 25, 2024 at 8:09 PM

హీరో సుహాస్ నటిస్తున్న ‘ఓ భామ అయ్యో రామా’ చిత్ర గ్లిమ్స్ విడుదల

సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న…

December 25, 2024 at 8:03 PM