Politics

మామ‌ BRS టికెట్ కోసం అల్లుడు అల్లు అర్జున్ సాయం

క‌థానాయ‌కుడు అల్లుఅర్జున్ ఈ రోజు తెలంగాణలోని న‌ల్ల‌గొండ జిల్లాకు వెళ్లారు. త‌న భార్య స్నేహారెడ్డి తండ్రి, త‌న‌కు మామ అయిన బీఆర్ ఎస్‌నేత కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి స్వ‌గ్రామంలో నిర్మించిన ఫంక్ష‌న్‌హాల్‌ను ఆయ‌న నేడు ప్రారంభించారు. పెద్ద‌వూర మండ‌లంలోని చింత‌ప‌ల్లి గ్రామానికి చెందిన చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి భ‌ట్టుగూడెం వ‌ద్ద కంచ‌ర్ల‌క‌న్వెష‌న్ పేరుతో ఫంక్ష‌న్‌హాల్‌ను నిర్మించారు. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి రానున్న ఎన్నిక‌ల్లో న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున‌సాగ‌ర్ నుంచి బీఆర్ ఎస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. అందుకే ఆయ‌న గ‌త కొద్దిరోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అల్లుఅర్జున్‌తో ఈ ప్రారంభోత్స‌వం కార్య్ర‌క‌మం నిర్వ‌హించ‌డం, దీంతో త‌న ప‌లుకుబ‌డిని, త‌న అల్లుడు క్రేజ్‌ను అధిష్టానంకు చూపించి టికెట్ పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న ఆశిస్తున్నార‌ని అంటున్నారు. ఇందుకోసం ఈ రోజు అక్క‌డ జిల్లా న‌లుమూలాల నుంచి భారీఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకున్నారు.

2014 ఎన్నిక‌ల్లో నే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. 24 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో గెలుపొందిన టీడీపీ అభ్య‌ర్థి మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి ఆ త‌రువాత టీఆర్ ఎస్‌లో చేర‌డంతో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని పార్టీ ప‌క్క‌న పెట్టింది.దీంతో ఆయ‌న త‌న స్వ‌స్థ‌ల‌మైన నాగార్జున సాగ‌ర్ నుంచి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకుని ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాడు. నియోజ‌క‌వ‌ర్గం వారిగా ప‌ర్య‌టించి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నాడు.

తాజాగా ఆధునిక వ‌స‌తుల‌తో 1000 మందికి స‌రిపోయే ఫంక్ష‌న్‌హాల్‌ను నిర్మించారు. స‌మీప గ్రామాల ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ధ‌ర‌ల‌కే ఇది అందుబాటులో ఉంచుతామ‌ని ఆయ‌న తెలిపారు. ఇప్పుడు ఈ ప్రారంభోత్స‌వాన్ని త‌న అల్లుడు పాపులారిటీతో ఘ‌నంగా నిర్వ‌హించి త‌న సత్తా చాటి, బీఆర్ ఎస్ టికెట్‌ను పొందాల‌ని ఆశిస్తున్నాడు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. సో.. మామ ఎమ్మేల్యే సీటు కోసం అల్లుడు అల్లుఅర్జున్ త‌న వంతు స‌హాయం చేస్తున్నాడు అన్న‌మాట‌.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM