rana siima
ప్రతిష్ఠాత్మక ‘సైమా’(SIIMA సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 అవార్డ్స్ వేడుక సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్స్ నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి, సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్, శశాంక్ శ్రీవాస్తవ్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
ప్రెస్ మీట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. దక్షణాది చిత్ర పరిశ్రమలన్నీ కలసి ఆనందంగా జరుపుకునే వేడుక సైమా. గత 11 ఏళ్ళుగా ఈ వేడుకల్లో భాగమౌతున్నప్పటికీ ఇప్పుడే మొదలుపెట్టిన ఉత్సాహం, ఆనందం వుంది. గ్లోబల్ ఫ్లాట్ ఫామ్ కి చేరుకోవడానికి సైమా గొప్ప వేదిక. ఈ వేడుకల్లో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. అందరం దుబాయ్ లో కలుద్దాం’’ అన్నారు.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. సౌత్ లో పని చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి సైమా తో అసోసియేషన్ వుంది. విష్ణు, బృందా గారికి థాంక్స్. ఈ వేడుకల్లో లెజండరీ నటీనటులతో కలసి వేదిక పంచుకోవడం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది’’ అన్నారు.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. సైమా వేడుకల్లో పాల్గొనడం నాకు ఇదే మొదటిసారి. విష్ణు, బృందా గారికి కృతజ్ఞతలు. సైమా అవార్డుల వేడుకే కాదు సినిమాని ఒక పండుగలా జరుపుకునే వేడుక. అన్ని చిత్ర పరిశ్రమలూ పండుగ లా జరుపుకునే ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ మాట్లాడుతూ.. సైమా వేడుక అన్ని చిత్ర పరిశ్రమలకు ఒక రీయూనియన్, హోమ్‌కమింగ్ లాంటిది. రానా గారి గురించి మాటల్లో చెప్పలేను. ఆయన లేకుండా సైమా వేడుకని ఊహించలేం. నిధి అగర్వాల్ ఇదివరకే వేడుకల్లో పాల్గొన్నారు. మీనాక్షి కి స్వాగతం. సైమా వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైయింది. రాబోయే రెండు వారాలు ఇంకా మరింత ఎక్సయిటెడ్ గా వుంటుంది. సెప్టెంబర్ 15, 16న దుబాయ్ లో కలుద్దాం’’ అన్నారు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…