Cinema

‘అహో! విక్రమార్క’ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల

బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు,  ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి మొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘అహో! విక్రమార్క’ అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

‘అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ 2024 మార్చి 8న పుణెలోని పింప్రి చించ్‌వాడ్‌లోని డాంగే రోడ్‌లో ఎంతో ఘనంగా జరిగింది. భారీ తారాగణంతో రానున్న ‘అహో! విక్రమార్క’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నటుడిగా మారిన నిర్మాత, మగధీర ఫేమ్ దేవ్ గిల్ ఈ ప్రాజెక్ట్ గురించి  చెబుతూ.. ‘అహో! విక్రమార్క’తో, మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము” అని పేర్కొన్నారు.

దర్శకుడు పేట త్రికోటి ఈ చిత్రం గురించి చెబుతూ..’అహో! విక్రమార్క’ ద్వారా, భాష, సంస్కృతులను, వీరత్వం, త్యాగం సారాంశాన్ని చిత్రీకరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని అన్నారు.

ఈ చిత్రంలో దేవ్ గిల్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ మరియు బిత్తిరి సత్తిలతో కూడిన భారీ తారాగణం నటిస్తోంది.  యాక్షన్, ప్రేమ, భావోద్వేగం వంటి అంశాలతో ఈ చిత్రం రాబోతోంది. ‘అహో! విక్రమార్క’ దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: దేవ్ గిల్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM