All Time Records on Pushpa Saami Saami Song
ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప: ది రైజ్ సినిమాలోని మూడో పాట సామీ సామీ ఈ మధ్య విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాట రికార్డులు తిరగరాస్తోంది. అత్యధిక వ్యూస్ అత్యంత వేగంగా సాధించిన పాటగా సౌత్ ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది సామి సామి సాంగ్.
విడుదలైన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించింది. మరే లిరికల్ వీడియోకు అయినా 24 గంటల్లో వచ్చిన అత్యధిక వ్యూస్ ఇవే.
పుష్ప సినిమాలోని మొదటి పాట దాక్కో దాక్కో మేక 24గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఆ రికార్డును సామీ సామీ తిరగరాసింది. అత్యధిక వ్యూస్ సాధించిన మొదటి 6 టాలీవుడ్ లిరికల్ వీడియో సాంగ్స్ లో 4 అల్లు అర్జున్ ఖాతాలో ఉన్నాయి.
ఇందులో మొదటి రెండు స్థానాల్లో సామి సామి, దాక్కో దాక్కో మేక ఉన్నాయి. ఆ తర్వాత రాములో రాముల (7.37 million views), శ్రీవల్లి (7 million views) లిరికల్ వీడియోలు ఉన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానుంది.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…