Cinema

“అమరావతికి ఆహ్వానం” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్రల్లో నటించిన “అమరావతికి ఆహ్వానం” సినిమా ఫిబ్ర‌వ‌రి 13న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ జీవీకే తెరకెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు నిర్మించారు. “అమరావతికి ఆహ్వానం”కు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను మూవీ టీమ్ కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో

హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ – మా అమరావతికి ఆహ్వానం సినిమా గురించి ఇన్ని రోజులు మేము చెబుతూ వచ్చాం. ఈరోజు మా సినిమా రిలీజైంది. ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియా, ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీలోని వారు కూడా మా సినిమా గురించి బాగా పాజిటివ్ గా చెబుతున్నారు. మూవీలో మేమంతా బాగా నటించామని అంటున్నారు. రేపు వాలెంటైన్స్ డే, వీకెండ్ కూడా వస్తోంది. మీరంతా మా సినిమాను చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే ఇంకా చూడని వారుంటే తప్పకుండా థియేటర్స్ లో మా మూవీ చూడాలని కోరుతున్నాం. అన్నారు.

హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ – “అమరావతికి ఆహ్వానం” సినిమాకు ప్రతి ఒక్కరూ తమ పూర్తి ఎఫర్ట్స్ పెట్టారు. సినిమాలో నేను చాలా బాగా కనిపించానంటూ ప్రశంసలు వస్తున్నాయి. మా మూవీ చూడండి మీరు ఎంటర్ టైన్ అవుతారు, హారర్ ఎలిమెంట్స్ థ్రిల్ చేస్తాయి. మీడియా మిత్రులు గత రెండు వారాలుగా మా మూవీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. “అమరావతికి ఆహ్వానం” సినిమా చూడండి చూసి మీ అభిప్రాయం సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి. అన్నారు.

డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ – మా “అమరావతికి ఆహ్వానం” సినిమాకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించినదాని కంటే బాగా రెస్పాన్స్ ఉంది. మా మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాపై మా నిర్మాతలు పెట్టకున్న నమ్మకాన్నినిలబెట్టుకున్నాను. మా యాక్టర్స్ శివ గారు, ఎస్తేర్, ధన్య, సుప్రిత..ఇలా ప్రతి ఒక్కరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. అశోక్ కుమార్ గారు కూడా ఒక స్పెషల్ రోల్ చేశారు. వీకెండ్ వస్తోంది, అలాగే మహా శివరాత్రి హాలీడే ఉంది. ఈ వీకెండ్ లో మా సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డిఓపి ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ – కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మా “అమరావతికి ఆహ్వానం” సినిమా సక్సెస్ తో ప్రేక్షకుల మరోసారి ప్రూవ్ చేశారు. ఈరోజు ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తున్నారంటే మా మూవీలో కంటెంట్ నచ్చడమే కారణం. ఇలాంటి చిత్రాన్ని థియేటర్స్ లో చూస్తేనే ఎంజాయ్ చేయగలరు. చిన్న సినిమా సక్సెస్ అయితే మా లాంటి ప్రొడ్యూసర్స్ మరిన్ని మూవీస్ చేస్తారు. మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ్ భరద్వాజ్ మాట్లాడుతూ – ఈ రోజు మా సినిమా థియేటర్స్ లోకి వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. మ్యూజిక్ కు మంచి పేరు రావడం హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరూ బీజీఎం చాలా బాగుందని అంటున్నారు. మా సినిమాను ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ – సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో మేమంతా పాజిటివ్ వైబ్ లో ఉన్నాం. ఈ వైబ్ ఇలాగే కొనసాగాలి. అన్ని సెంటర్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఉంది. అన్ని ఏరియాల్లో షోస్ పెంచుతున్నారు. రేపు వాలెంటైన్స్ డే సందర్బంగా ఒక టికెట్ మీద కపుల్ సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నాం. సినిమా బాగుందంటూ నాకు మెసేజ్ లు వస్తున్నాయి. మా ఆర్టిస్టులందరికీ గుర్తింపు దక్కుతోంది. నేనూ బాగా నటించానని అంటున్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ సంతోషంతో గంతులు వేస్తున్నాడు. మా “అమరావతికి ఆహ్వానం” సినిమాకు విజయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

నటీనటులు – శివ కంఠంనేని, ఎస్తేర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్, తదితరులు

Recent Posts

హే భగవాన్‌ నిర్మాత బి.నరేంద్ర రెడ్డి ఇంటర్వ్యూ

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 13, 2026 at 9:33 PM

24 గంటల్లోనే.. ఓటీటీలోనూ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు, డిజిటల్ వరల్డ్ లో…

February 13, 2026 at 9:11 PM

మెగా ట్విన్స్ పేర్లపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జనవరి 31న కవలలకు జన్మనివ్వడంతో కుటుంబంలో ఆనందం రెట్టింపయ్యింది. వారి…

February 13, 2026 at 9:05 PM

“మార్కండేయ” టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు

యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'దిల్ రాజు డ్రీమ్స్' అనే బ్యానర్ స్థాపించారు.…

February 13, 2026 at 8:54 PM

నాని ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్

నేచురల్ స్టార్ నాని మ్యాసీవ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV…

February 13, 2026 at 8:39 PM

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM