Cinema

‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ తెలిసేది మార్చి 5న!

‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ చిత్రం గురించి ఈ మధ్య సోషల్ మీడియా బాగా టాక్ నడుస్తుంది. కొందరు సెలబ్రిటీలు ఈ సినిమా గురించి చెబుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు వీరాస్వామి. జి మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన మా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో చిత్ర విజయంపై మాకు మరింత విశ్వాసం కలిగింది. తప్పకుండాఓ కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారనే నమ్మకం ఉంది అంటున్నారు.

దర్శకుడు వీరాస్వామి.జి. స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని పనులను పూర్తిచేసుకుంది. అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ అనే డిఫరెంట్ టైటిల్‌తోనే అందరిలోనూ ఆసక్తిని కలిగించిన మా చిత్రం ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత ఉత్కంఠను పెంచింది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో రూపొందుతున్న మా చిత్రం ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. థ్రిల్లర్ జోనర్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. తప్పకుండా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. మార్చి 5న చిత్రాన్ని విడుదల చేస్తాం.. అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్, స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM