april 28 em jarigindi release on february 27
రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వీరాస్వామి.జి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఏప్రిల్ 28న ఏం జరిగింది. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మా చిత్రం ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత ఉత్కంఠను పెంచింది. వినాయక్ గారికి మా ట్రైలర్ నచ్చడంతో పాటు సినిమా విజయం సాధించాలని మాకు ఆల్ ది బెస్ట్ చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో రూపొందుతున్న మా చిత్రం ప్రతి మలుపు ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా వుంటుంది.
ముఖ్యంగా చిత్రంలోని ఇంటర్వెల్ బ్యాంగ్, పతాక సన్నివేశాలు ఎవరూ ఊహించని రీతిలో షాకింగ్‌గా వుంటాయి. థ్రిల్లర్ జోనర్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. ఈ నెల 27న విడుదల కానున్న మా చిత్రం తప్పకుండా అందరి ప్రశంసలు అందుకుంటుంది అన్నారు. ఇంతకు ముందు ప్రకటించిన డేట్ కంటే ముందుగానే మా చిత్రం రిలీజ్ అవుతుందని చిత్ర నిర్మాతలు తెలియచేశారు.
అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…