Featured

కేసు వద్దంటే ముద్దు ఇవ్వాలన్న పోలీసు.. సీసీటీవీ కెమెరా చూడకపోవడంతో..

లంచాలు తీసుకొని కేసులు ఎత్తేసే పోలీసుల కథలు మనకు తెలుసు. అయితే ఇలా చేయడానికి ఎక్కడైనా డబ్బు తీసుకుంటారు. కానీ ఓ పోలీసు మాత్రం ఓ యువతితో నీచంగా ప్రవర్తించాడు. అయితే ఆ ప్రాంతంతలో ఓ సీసీటీవీ ఉందన్న విషయాన్ని అతను గమనించలేదు. అదే అతను చేసిన నీచాన్ని బయట పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికాలోని పెరూలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ స్థానికంగా పని చేస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్.. ఒక యువతిని పట్టుకున్నాడు. నిబంధనలు అతిక్రమించావంటూ ఆమెపై కేసు పెట్టబోయాడు. ఆమె తనపై కేసు పెట్టొద్దని వేడుకుంది. అదిగో సరిగ్గా అప్పుడే ఆ పోలీసులో దుర్మార్గుడు నిద్ర లేచాడు.

ఆమెపై కేసు పెట్టకుండా ఉండాలంటే తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అది కూడా అల్లాటప్పా లంచం ఇస్తే సరిపోదని ఆమెను ఓ వింత కోరిక కోరాడు. అదేంటో తెలుసా..? ఓ ముద్దు. అవునండీ.. తనతో ఆ యువతి లిప్‌లాక్ చేస్తే కేసు పెట్టకుండా వదిలేస్తానని హామీ ఇచ్చాడు. ఏమీ చేయలేని పరిస్థితిలో మనసు చంపుకున్న ఆ యువతి అతనికి ముద్దిచ్చింది. అయితే ఈ ముద్దు సీన్ జరిగిన ప్రదేశంలో ఓ సీసీ కెమెరా ఉంది. దీన్ని ఆ పోలీసు చూడలేదు. దీంతో అతని బండారం వెలుగులోకి వచ్చేసింది.

ఈ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందంటే.. ఇక్కడి ఓ స్థానిక టీవీ చానల్ కూడా దీన్ని ప్రసారం చేసింది. దీంతో ఈ వీడియో మరింత వైరల్ అయింది. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి పోలీసు శాఖ చెవికి చేరింది. అంతే దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. ఈ ముద్దు తీసుకున్న పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM