ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న'అర్జున్ S/O వైజయంతి' Arjun S/O Vyjayanthi to Release Worldwide on April 18th
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ S/O వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా టీజర్ కు ఇప్పటికే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘నాయల్ది’ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. మూవీ టీం దూకుడుగా ప్రమోషన్లు చేస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి రాబోయే వేసవి సెలవుల అడ్వాంటేజ్ కానున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్ లో కనిపిస్తున్నారు. తన ఇంటెన్స్ ప్రజెన్స్ సినిమాలోని క్యారెక్టర్ పవర్ ఫుల్ వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది.
ఈ మూవీ వండర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని హామీ ఇస్తుంది, కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా. రిలీజ్ డేట్ ని లాక్ చేయడంతో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మరింత ముమ్మరం చేయనున్నారు.
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…