Cinema

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి ‘బీబీ3’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

న‌ట‌సింహ‌ బాల‌కృష్ణ‌, మాస్‌ డైరెక్టర్‌ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో మూడవ చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బీబీ3’. సింహా, లెజెండ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ రూపొందుతోన్న‌ హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ చిత్రంపై మాములుగా అంచనాలు లేవు. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా రిలీజ్ చేసిన బీబీ3 ఫస్ట్‌ రోర్‌ టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్రయూనిట్‌ ప్రకటించింది.

వరుసగా అన్ని చిత్రాల విడుదల తేదీలను ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని మే28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. టీజ‌ర్‌లో మాస్‌లుక్‌లో అద‌ర‌గొట్టిన న‌ట‌సింహం ఇప్పుడు స్టైలిష్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు. జేబులో చేయిపెట్టుకుని న‌డిచి వ‌స్తున్న బాల‌య్య స్టైలిష్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మే 28, ఈ డేట్‌కి ఉన్న మరో విశేషం ఏమిటంటే.. విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న‌ నందమూరి తారక రామారావు జ‌యంతి.

విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. ”సింహా, లెజెండ్ త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను గార్ల కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మ‌రో సూప‌ర్‌ సెన్సేష‌న‌ల్ మూవీగా ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తుంది. మా ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో అత్యంత ప్రెస్టీజియ‌స్‌గా, భారీ తారాగ‌ణంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఫిబ్ర‌వ‌రి సెకండ్ వీక్ నుండి ఫైన‌ల్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్త‌వుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే28న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నాం” అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌తో పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ మిస్సైల్‌ ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తుండగా సి. రాంప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో నందమూరి అభిమానులు ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM