Cinema

వైరల్‌ అవుతోన్న నమిత వర్కౌట్స్‌ వీడియో

ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన నటి నమిత. పెళ్లి చేసుకుని కాస్త గ్యాప్‌ ఇచ్చింది కానీ.. ఇప్పటికీ ఆమె పేరు హాట్‌ టాపిక్కే. ఆమె పేరు వినబడితే.. అలెర్ట్ అవ్వడం మాత్రం పక్కా. అంతగా నమిత తన అందచందాలతో ఊపేసింది. ముఖ్యంగా బాలయ్య బాబుతో చేసిన ‘సింహా’ చిత్రంలోని సింహమంటి చిన్నోడే అనే పాట నమితను మరిచిపోనివ్వకుండా చేస్తుంటుంది. ఇక పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత, ఆ మధ్య తమిళ బిగ్‌ బాస్‌ లోనూ, అలాగే కొన్ని రియాలిటీ షోస్ లోనూ దర్శనమిచ్చింది.

ఈ షోలలో ఆమె కాస్త భారీగా కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. వాస్తవానికి వెంకటేష్‌ జెమిని చిత్రంలో నమిత ఎంతో అందంగా, స్లిమ్‌గా కనిపించింది. ఆ తర్వాత తన శరీరంపై శ్రద్ధ పెట్టకపోవడంతో భారీగా మారిపోయింది. తన శరీరంపై కొన్ని కామెంట్స్‌ ఆమే స్వయంగా చేసుకుంది. తగ్గనంటే తగ్గను.. ఇలాగే ఉంటాను అని కూడా చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఏమనుకుందో ఏమిటో గానీ.. తన భారీ శరీరాన్ని తగ్గించేందుకు జిమ్‌లో భారీగా కష్టపడుతోంది.

తాజాగా నమిత జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో నమిత చాలా వరకు తన భారీ కాయాన్ని తగ్గించింది. తను ఎంత తగ్గిందో ఫోన్‌లో చూసుకుంటుంది. ఈ వీడియోలో నమితను చూసిన వారంతా.. మళ్లీ స్లిమ్‌గా అవుతోంది. త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వవచ్చు. త్వరగా వస్తే బాగుండు.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి వారి కామెంట్స్‌ ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాల్సి ఉంది. అన్నట్లు నమిత రాజకీయాలలో కూడా చక్రం తిప్పాలని చూస్తోంది.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM