Cinema

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా బిగ్ ట్రీట్

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన పాన్ వరల్డ్ సినిమా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ కాన్వాస్ పై నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సినిమాపై హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేశాయి. ఇప్పుడు, మేకర్స్ బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు.

ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వేడుకలకు టీమ్ సిద్ధమవుతోంది. అదే రోజున చిత్రంలోని ఫస్ట్ సింగిల్ “ఆయా షేర్”ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గూస్‌బంప్స్ తెప్పించే ఈ ఇంట్రడక్షన్ ట్రాక్‌తో సినిమా ప్రమోషన్స్‌కు ఘనమైన ఆరంభం ఇవ్వబోతున్నారు మేకర్స్.

ఈ పాటను వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో చిత్రీకరించారు. నాని ఫియర్స్, మాస్సీ అవతార్‌లో కనిపించే ఈ సాంగ్ కోసం రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పవర్‌ఫుల్ మాస్ ట్యూన్ అందించారు. సుధన్ మాస్టర్ రూపొందించిన డైనమిక్ కొరియోగ్రఫీ ఈ ట్రాక్‌ను విజువల్ స్పెక్టకిల్‌గా అలరించబోతోంది. అభిమానులకు ఇది బర్త్‌డే ట్రీట్‌గా మారనుంది.

ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తారు అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. ది ప్యారడైజ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాల్, స్పానిష్, ఇంగ్లీష్ భాషలలో పాన్-వరల్డ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తారాగణం: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
డిఓపి: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM