హోలీ శుభాకాంక్షలతో చేతన్ కృష్ణ ‘ధూం ధాం’ కొత్త పోస్టర్ రిలీజ్ Chetan Krishna Dhoom Dham Movie Poster Unveiled By Holi Wishes
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇవాళ హోలీ పండుగ సందర్భంగా “ధూం ధాం” సినిమా నుంచి హోలీ శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేశారు. ఫారిన్ లొకేషన్ లో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ను ఈ పోస్టర్ లో రివీల్ చేశారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “ధూం ధాం” సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.
శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్ లో సుహాసిని, వినోద్ కుమార్ ప్రధాన జంటగా,శ్రీనివాస్ అనంతనేని , మౌనిక హీరోహీరోయిన్లుగా బీమ్…
భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ GOYAZ తన 30వ స్టోర్‌ను సికింద్రాబాద్‌లోని పాట్నీ, ఆర్.పీ. రోడ్డులో వైభవంగా…
సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…