Cinema

ఫిబ్ర‌వ‌రి 6న ‘ఎఫ్‌సీయూకే’ బార‌సాల ఫంక్షన్

‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌).. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్తకొత్త మార్గాలను చూపుతోంది. ఇప్పటి వరకు పాటలతోనే హడావుడి చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు సరికొత్తగా ఈ చిత్ర బారసాల వేడుకను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌).

ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోన్న విషయం తెలిసిందే. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించారు. కాగా, ఈ నెల 6న అనగా శ‌నివారం ఈ సినిమా బార‌సాల వేడుక జ‌ర‌గ‌నున్న‌ది. ఈ విష‌యం తెలియ‌జేస్తూ, ‘ఎఫ్‌సీయూకే బార‌సాల వేడుక ఫిబ్ర‌వ‌రి 6న’ అంటూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది.

దీన్ని చూసి బార‌సాల వేడుక ఏమిటి!.. అంటూ అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యం, కుతూహ‌లం వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ త‌ర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్‌కే ఆ పేరు పెట్టిన‌ట్లు అర్థం చేసుకొన్నారు. ఆ రోజు ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కులు చూడ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్‌, వారి క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. వీట‌న్నింటికీ మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీజ‌ర్‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించిన తీరు అంద‌రిలోనూ క్యూరియాసిటీని రేకెత్తించి, సినిమాపై అంచ‌నాల‌ను అనూహ్యంగా పెంచేసింది.

రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో యంగ్ హీరోకు ఫాద‌ర్‌గా టైటిల్ రోల్ చేసిన జ‌గ‌ప‌తిబాబు క్యారెక్ట‌ర్‌లోని రొమాంటిక్ యాంగిల్‌, ఆ యాంగిల్‌ను ఆయ‌న పండించిన తీరు ప్రేక్ష‌కుల్ని అమితంగా అల‌రించ‌నున్నాయి. ఫ్యామిలీ హీరోగా పేరుపొందిన ఆయ‌న చాలా కాలం త‌ర్వాత ఈ త‌ర‌హా పాత్ర‌ను పోషించ‌డం గ‌మ‌నార్హం.

అలాగే ఈ చిత్ర పాటలను కొవిడ్ టైమ్‌లో అండగా నిలబడిన వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్‌, మీడియా వ్యవస్థలకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేసి.. చిత్రయూనిట్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు బారసాల అంటూ పేరు పెట్టడంతో.. ఇండస్ట్రీలో ఈ సినిమాపై ప్రత్యేక అటెన్షన్ కనబడుతోంది.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM