Cinema

తమిళ స్టార్ హీరోకి మాస్ మహారాజా సపోర్ట్

తమిళ స్టార్ హీరోకి తెలుగు మాస్ మహారాజా రవితేజ సపోర్ట్‌గా నిలిచారు. అదెలా అనుకుంటున్నారా? తెలుగులోనూ మంచి నటుడిగా పేరు పొందిన సూపర్ స్టైలిష్ తమిళ స్టార్ హీరో శింబు నటించిన చిత్ర టీజర్‌ను రవితేజ విడుదల చేశారు. శింబు, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ కామాచి.. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం ‘మానాడు’ తెలుగు టైటిల్ ‘రీవైన్డ్’ను అలాగే చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు.

ఈ సందర్భంగా రవితేజ తన ట్వీట్‌లో.. ‘‘శింబు పుట్టినరోజు సందర్భంగా.. తను నటిస్తున్న మల్టీలింగ్యుల్ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అంటూ.. శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం ఈ చిత్ర ముఖ్య ఆకర్షణల్లో ఒకటి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చుతున్నారు.

తమ చిత్రం ‘రీవైన్డ్’ టీజర్, తాజాగా ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్ర హిందీ టీజర్ ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, తమిళ్ టీజర్ ఏ.ఆర్.రెహమాన్, కన్నడ టీజర్ కిచ్చా సుదీప్ రిలీజ్ చేయడం విశేషం. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. టీజర్‌కు మంచి స్పందన వస్తుండటంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM