Cinema

‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ సినిమా ఎవరితో..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ మధ్యే ఈ చిత్రం దుబాయ్ లో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్ షూటింగ్ ని జరుపుకుంటుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహానటి కీర్తి సురేష్ మహేష్ పక్కన జోడిగా నటిస్తోంది. ఇందులో మహేష్ కొత్త లుక్ తో దర్శనం ఇవ్వబోతున్నాడు. కాగా ఈ చిత్రం బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలపై చిత్రీకరించబడుతుందనే విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా ఈ చిత్రం తరువాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడా? అని టాలీవుడ్‌లో ఒకటే చర్చలు నడుస్తున్నాయి. కానీ మహేష్ ఓ భారీ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలపై మొగ్గు చూపుతుండడంతో, మహేష్ కూడా ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నాడని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని అంటున్నారు.

అయితే రాజమౌళి ఓ వేదికపై మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి, మహేష్ ల కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. దీనిపై రాజమౌళి తండ్రి ఒక చిన్న హింట్ కూడా ఇచ్చాడు. మహేష్ సినిమా కథ ఆఫ్రికా అడవికి సంబంధించి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేసే సినిమా రాజమౌళితోనా, లేదంటే బాలీవుడ్ నిర్మాత తీసే పాన్ ఇండియా సినిమానా అనేది తెలియాల్సిఉంది.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM