Cinema

నాగార్జునతో రొమాన్స్‌కు కాజల్‌ గ్రీన్‌సిగ్నల్‌

టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఫిలింలో కింగ్ నాగార్జున హీరోగా నటిసున్నారు. హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న‌ట్లు అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టిస్తూ.. నాగార్జున- ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో రూపొందుతో‌న్న యాక్ష‌న్ డ్రామా‌లోకి కాజ‌ల్‌ను స్వాగ‌తిస్తున్నాం అని స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ఈ మూవీ షూటింగ్ గోవా, హైద‌రాబాద్‌, ఊటీ, లండ‌న్‌ల‌లో జర‌ప‌డానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా..

హీరోయిన్ కాజల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ – ”టాలీవుడ్‌లో నాకు చాలా అద్భుతమైన స‌మ‌యం. నాగార్జున గారితో ఇది నా మొదటి సినిమా. ఇప్ప‌టివ‌ర‌కూ నా కెరీర్‌లో పోషించన‌టువంటి ఒక ప్ర‌త్యేక‌మైన పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నాగార్జున గారు అంటే విపరీతమైన ఇష్టం. ఈ ప్రాజెక్ట్‌లో ఆయ‌న‌తో కలిసి పనిచేయడం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా ఉంది“ అన్నారు. ‌

కింగ్ నాగార్జున, కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రియు భారీతారాగ‌ణం న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: ముఖేష్ జి,
యాక్ష‌న్: గ‌ణేష్ కె,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: బోనీ జైన్‌,
ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌: జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌న‌ణ్‌,
ఆర్ట్: ల‌క్ష్మి సిందూజ గ్రాందీ,
నిర్మాత‌లు: నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్,
ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌వీణ్ స‌త్తారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM