Cinema

రోటి క‌ప‌డా రొమాన్స్ చిత్రం నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుద‌ల

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు.   ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. ఈచిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన  ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న  వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మై ఫ్రెండ్ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిగ్‌బాస్ ఫేమ్‌, ప్రముఖ న‌టుడు శివాజీ, స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌, ర‌చ‌యిత ప్ర‌స‌న్న‌కుమార్‌లు ఈ సాంగ్‌ను  లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా శివాజీ మాట్లాడుతూ… ఇటీవ‌ల నేను ఈ సినిమా చూశాను. నేటి యూత్‌కు న‌చ్చే ట్రెండీ సినిమా ఇది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో వున్న న‌టీన‌టులు అంద‌రూ  చాలా చ‌క్క‌గా న‌టించారు. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ రెడ్డి చిత్రాన్ని బాగా హ్యాండిల్ చేశాడు. ఈ చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మ‌రో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడు దొరికాడు. నాకు న‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కులంద‌రికి కూడా న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

న‌క్కిన త్రినాథ‌రావు మాట్లాడుతూ… ఈ సినిమా పోస్ట‌ర్ చూస్తుంటే, ఈ బ్యాన‌ర్‌లో నేను చేసిన మేం వ‌య‌సుకు వ‌చ్చాం రోజులు గుర్తుకొస్తున్నాయి. చాలా ట్రెండీ టైటిల్ ఇది. కంటెంట్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించి అంద‌రికి మంచి పేరును తీసుక‌రావాల‌ని ఆశిస్తున్నాను అన్నారు.

ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ…  సినిమా నిర్మాణం మీద‌, క‌థ మీద నాలెడ్జ్‌, గ్రిప్ వున్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌. కొత్త‌వాళ్ల‌తో సినిమా తీయ‌డం ఈ రోజుల్లో ఎంతో గ‌ట్స్ వుండాలి. ఈ సినిమా కంటెంట్ మీద న‌మ్మ‌కం వుంది. మ్యాట‌ర్ వున్న సినిమాలా అనిపిస్తుంది అన్నారు. యానిమ‌ల్ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందించార‌ని, ఈ పాట చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు నా స్నేహితులు గుర్తుకు వ‌చ్చార‌ని, ఆల్ ఎమోష‌న్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని చిత్ర దర్శ‌కుడు విక్ర‌మ్ రెడ్డి తెలిపారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ… పెద్ద సినిమాల‌తో పోటిప‌డే గ‌ట్టి కంటెంట్‌తో నిర్మించిన చిత్ర‌మిది. ఫ్రెండ్‌షిప్ అనేది ఎవ‌ర్ గ్రీన్‌, ఈ పాట కూడా త‌ప్ప‌కుండా అంద‌రి మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుంది. పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ స‌మ్మ‌ర్‌కు పెద్ద విజ‌యాన్ని అందుకుంటుంది అన్నారు.

Share
Published by
Shankar

Recent Posts

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM

‘హే భగవాన్’ నాట్ ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 12, 2026 at 10:07 PM

హుషారు పిట్టలు రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం: టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

February 12, 2026 at 9:59 PM

నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…

February 12, 2026 at 9:54 PM

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…

February 12, 2026 at 6:41 PM

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…

January 15, 2026 at 10:33 AM