Cinema

రామ్ పోతినేని, శ్రీలీల కుమ్ముడే కుమ్ముడు

సరైనోడు, అఖండ బ్లాక్ బస్టర్స్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ థమన్ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి మూడవ చిత్రానికి కొలబరేట్ అయ్యారు. ఉస్తాద్ రామ్ పోతినేని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’- ది ఎటాకర్ ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే జోరందుకున్నాయి. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదటి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మేకర్స్ సెకండ్ సింగిల్ గందారబాయి లిరికల్ వీడియోని విడుదల చేశారు.

ఎస్ఎస్ థమన్ మరో బ్లాక్ బస్టర్ నంబర్‌ను అందించారు. మొదటి పాట ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అయితే, గందారబాయి మాస్ ధమకేధార్ ఫోక్లోర్. బీట్, ఆర్కెస్ట్రేషన్ ఎనర్జిటిక్ గా మాస్ వైబ్‌తో ఆకట్టుకున్నాయి. నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల వాయిస్ మెస్మరైజ్ చేసింది. అనంత శ్రీరామ్ మాస్ లిరిక్స్ రాసిన ఈ పాటను వైబ్రెంట్ సెట్స్ లో చిత్రీకరించారు.

రామ్, శ్రీలీల తమ ఎనర్జీతో ప్రేక్షకుల మనసుని కొల్లకొట్టారు.ఎక్స్ టార్డినరీ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. రామ్ డ్యాన్స్‌లో డైనమిజం చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ఈ ఇద్దరు గ్రేట్ డ్యాన్సర్లు. వాళ్ళ డ్యాన్స్ చూడ్డానికి రెండు కళ్లు చాలవు. నాటు నాటు సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ నంబర్ కు కొరియోగ్రఫీ చేశారు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM