Cinema

‘టైగర్ నాగేశ్వరరావు’ దండయాత్ర అదిరింది

ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్ యావత్ దేశాన్ని షేక్ చేశాయి. ఇప్పుడు ది గ్లోరీ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్-టైగర్ నాగేశ్వరరావు గ్లింప్స్ విడుదల అయింది. మాస్ మహారాజా రవితేజ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైగర్ దండయాత్ర (Tiger’s Invasion) టీజర్ ఇప్పుడు విడుదలైంది.

హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, దేశంలోని అనేక ప్రాంతాలలో దొంగతనాలు చేసిన స్టూవర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు మద్రాస్ సెంట్రల్ జైలు నుండి పరారీలో ఉన్నారనే వార్తా కథనంతో టీజర్ ప్రారంభమవుతుంది. మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగకపోవడంతో పోలీసులు షాక్‌ అవుతారు. టైగర్‌ జోన్‌లో పనిచేసిన మురళీ శర్మ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా టైగర్ నాగేశ్వరరావులోని అరుదైన నైపుణ్యాలను వివరిస్తారు.

‘’నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్లుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. దురదృష్టవశాత్తు, వాడొక క్రిమినల్ అయ్యాడు” అని మురళీ శర్మ టైగర్ నాగేశ్వరరావు సామర్థ్యాలను వివరిస్తారు.

టైగర్ నాగేశ్వరరావు చిన్నతనంలోనే నేరాలు చేయడం ప్రారంభించడంతో చిన్నప్పటి నుంచి వైల్డ్ స్వభావం కలిగి ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు , ఆర్మీ బెటాలియన్‌ను మోహరించారు, అలాంటి భయం అతను ప్రజలు, ప్రభుత్వంలో కలిగించాడు.

లాస్ట్ పోర్షన్ వరకు అతని ముఖాన్నిచూపించకపోయినా, టీజర్ అంతా అతని ప్రజన్స్ అనుభూతి చెందుతాం. టైగర్ ఎంట్రీ కథనాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. రైలు ఎపిసోడ్ పాత్ర యొక్క ధైర్యాన్ని చూపిస్తుంది.

ఇందులో రవితేజను చూసిన తర్వాత టైటిల్ రోల్‌లో మరే ఇతర స్టార్‌ను మనం ఊహించుకోలేము. ట్రాన్స్ ఫార్మేషన్ చెందడం నుంచి, పాత్రను పోషించడం వరకు రవితేజ ఎక్స్ టార్డినరిగా చేశారు. తన వైల్డ్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. దర్శకుడు వంశీ బ్రిలియంట్ రైటింగ్, అద్భుతమైన దర్శకత్వాన్ని అభినందించాలి. డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

ఆర్ మధి తన కెమెరా పనితనంతో కథనానికి గ్రాండ్‌నెస్ తెచ్చారు. ఇందులో జివి ప్రకాష్ కుమార్ తన అద్భుతమైన స్కోర్‌తో ప్రతి సీక్వెన్స్‌ను ఎలివేట్ చేశాడు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వరుసగా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లను క్రియేట్ చేసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మించారు, నిర్మాణ ప్రమాణాలు లావిష్ గా ఉన్నాయి.

మొత్తానికి టైగర్ దండయాత్ర తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM