Cinema

Gopichand Seetimaarr: గోపీచంద్ ‘సీటీమార్‌’ రిలీజ్‌ ఎప్పుడంటే..

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘సీటీమార్‌’. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల‌చేసిన ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, జ్వాలా రెడ్డిగా త‌మ‌న్నాలుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్న‌ట్లుగా గురువారం అధికారికంగా ప్ర‌క‌టిస్తూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.

చేతిలో పెద్ద సుత్తి ప‌ట్టుకుని టైర్ల‌మీద కూర్చుని ఉన్న గోపిచంద్ మాస్ లుక్‌తో ఈ పోస్టర్‌ ఉంది. ఈ పోస్టర్‌కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఇక రిలీజ్‌ డేట్‌ ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ‘‘గోపిచంద్ గారి కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మ‌రియు భారీ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే భావోద్వేగభరిత కథాంశమిది. ప్రతి సన్నివేశం హార్ట్‌ట‌చింగ్‌గా ఉంటుంది. మ‌ణిశ‌ర్మ‌గారు అద్భుత‌మైన పాట‌ల్ని కంపోజ్ చేశారు. ప్ర‌స్తుతం టాకీ పార్ట్ పూర్త‌య్యింది. రెండు సాంగ్స్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయి. గోపిచంద్‌, సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో మా శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న `సిటీమార్` చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 2న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నాం’’ అన్నారు.

గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశీ, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు న‌టిస్తోన్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి ఎస్‌. సౌందర్‌ రాజన్ అందిస్తుండగా సంగీతం మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ‌ అందిస్తున్నారు.

Recent Posts

“అమరావతికి ఆహ్వానం” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్రల్లో నటించిన "అమరావతికి ఆహ్వానం" సినిమా ఫిబ్ర‌వ‌రి 13న‌…

February 13, 2026 at 9:41 PM

హే భగవాన్‌ నిర్మాత బి.నరేంద్ర రెడ్డి ఇంటర్వ్యూ

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 13, 2026 at 9:33 PM

24 గంటల్లోనే.. ఓటీటీలోనూ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు, డిజిటల్ వరల్డ్ లో…

February 13, 2026 at 9:11 PM

మెగా ట్విన్స్ పేర్లపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జనవరి 31న కవలలకు జన్మనివ్వడంతో కుటుంబంలో ఆనందం రెట్టింపయ్యింది. వారి…

February 13, 2026 at 9:05 PM

“మార్కండేయ” టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు

యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'దిల్ రాజు డ్రీమ్స్' అనే బ్యానర్ స్థాపించారు.…

February 13, 2026 at 8:54 PM

నాని ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్

నేచురల్ స్టార్ నాని మ్యాసీవ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV…

February 13, 2026 at 8:39 PM