varun tej ghani release date locked, వరుణ్ తేజ్ గని మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా స్టార్ నటులు ఉపేంద్ర, సునీల్ శెట్టి ప్రధాన పాత్రలలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తాజాగా నిర్మాతలు తెలిపారు.
వరుణ్‌తేజ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ లుక్‌తో.. బాక్సర్ పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన వరుణ్ తేజ్ లుక్.. సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. వైవిధ్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వరుణ్ తేజ్ ఈ చిత్రంలో బాక్సర్‌గా కనిపించడంతో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్
మ్యూజిక్: తమన్.ఎస్
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్
నిర్మాతలు: సిద్ధు ముద్ద, అల్లు బాబీ
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…