Cinema

Salaar Heroine: ‘సలార్’లో ప్రభాస్‌కి హీరోయిన్ ఫిక్సయిందా..?

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, సెన్సేష‌న‌ల్‌ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, అగ్ర‌ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ కాంబినేష‌న్‌లో ప్యాన్‌ ఇండియా మూవీ ‘సలార్‌’ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ సత్తా ఇదని చాటుతున్న ప్రభాస్.. మరో ప్యాన్ ఇండియా ఫిల్మ్.. అదీ కూడా కెజియఫ్ వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్‌తో చేస్తుండటంతో.. ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఇలాంటి ప్యాన్‌ ఇండియా ఇమేజ్‌ ఉన్న స్టార్స్‌ కాంబినేషన్‌లో సినిమా రూపొందితే చూడాలని ఫ్యాన్సే కాదు.. ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. అయితే ఈ కోరికను తీర్చేలా భారీ బడ్జెట్‌ మూవీని చేయగలిగే నిర్మాత ఎవరా అనే ప్రశ్నకి సమాధానం.. సౌత్ ఇండియా సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తూ భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న హోంబలే ఫిలింస్‌ అధినేత విజయ్‌ కిరంగందూర్‌. ఇలాంటి క్రేజీ కలయికలోనే ‘సలార్‌’ తెరకెక్కనుండటంతో.. ఈ ప్రాజెక్ట్ పై భారీగా అంచనాలున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి.. నటీనటులను సెర్చ్ చేసే పనిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ దాదాపు పూర్తి చేసిన ప్రభాస్, నాగ అశ్విన్‌తో ఓ భారీ ప్రాజెక్ట్, అలాగే ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’కు కమిటై ఉన్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు ‘సలార్’కు కూడా ప్రభాస్ డేట్స్ ఇచ్చేసిన తరుణంలో.. ప్రశాంత్ నీల్ కూడా తన ‘కెజియఫ్ చాప్టర్ 2’ షూటింగ్‌ని పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతున్నాడు. త్వరలోనే ‘సలార్’ సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ విషయంలో అనేకానేక పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘సలార్’లో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేయబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా చిత్రయూనిట్ అయితే ప్రకటించలేదు కానీ.. ప్రస్తుతం సక్సెస్ మీదున్న శృతిహాసన్.. ఈ ప్రాజెక్ట్‌లో ఓకే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంత వరకు ప్రాజెక్ట్ రాలేదు. కాబట్టి.. శృతిహాసన్ ఫైనల్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ.. హోంబ‌లే ఫిలింస్ అధినేత విజ‌య్ కిర‌గందూర్‌‌కి, హీరో ప్ర‌భాస్‌‌కి ధ‌న్య‌వాదాలు తెలిపిన విషయం తెలిసిందే. ‘స‌లార్’ అందర్నీ మెప్పిస్తుందని ఆయన హామీ ఇచ్చేశాడు.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM