Cinema

‘మరణం’కు హీరో అడివి శేష్ సపోర్ట్

యువ కథానాయకుడు అడివి శేష్ ‘మరణం’ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో.. వీర్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ చిత్రం ‘మరణం’. కర్మ పేస్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు అడివి శేష్ చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో అడవి శేష్‌తో పాటు వీర్ సాగర్, శ్రీ రాపాక పాల్గొన్నారు.

ఫస్ట్ లుక్ విడుదల అనంతరం హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘‘మరణం ఫస్ట్ లుక్‌ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. పోస్టర్ చాలా బాగుంది మరియు భయపెడుతుంది, నాకు హారర్ చిత్రాలు అంటే భయం కానీ చాలామంది ప్రేక్షకులు ఇలాంటి హారర్ చిత్రాలు బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఇష్టపడతారు. పోస్టర్ ఎంత బాగుందో టీజర్ కూడా అంతే బాగుంది, మంచి సాంకేతిక విలువలతో నిర్మించారు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని అనిపించింది. హీరో దర్శకుడు వీర్‌కి, హీరోయిన్ శ్రీ రాపాకకి నా శుభాకాంక్షలు. ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించాలి’’ అని కోరారు.

వీర్ సాగర్ మాట్లాడుతూ.. ‘‘మా మరణం సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో అడివి శేష్‌గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా విజయానికి ఇది మా మొదటి అడుగు. మేము పిలవగానే వచ్చి మా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన అడివి శేష్ గారికి ధన్యవాదాలు. నన్ను నా కథను నమ్మి మా చిత్రాన్ని నిర్మించిన మా నిర్మాత బి రేణుకగారికి నా ధన్యవాదాలు. మా హీరోయిన్ శ్రీకి స్పెషల్ థాంక్స్. ఎందుకంటే తాను తన సొంత సినిమాగా భావించి పని చేసింది. ఈ సినిమా మా అందరికి మంచి బ్రేక్ ఇస్తుంది’’ అని అన్నారు.

హీరోయిన్ శ్రీ రాపాక మాట్లాడుతూ.. ‘‘మా మరణం సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన హీరో అడివి శేష్‌గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా హీరో, డైరెక్టర్ వీర్ సాగర్ గారికి ధన్యవాదాలు. కరోనా టైం లో లాక్‌డౌన్‌లో సినిమా చేశాము. అవుట్ పుట్ బాగా వస్తుంది. మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న మా టీమ్‌కి ధన్యవాదాలు” అని తెలిపారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM