పుట్టినరోజున సర్ప్రజ్ చేసిన రాజ‘శేఖర్’ | Rajasekhar Shekar movie look out
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తన పుట్టినరోజు (ఫిబ్రవరి 4)న అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. కరోనా టైమ్‌లో ఆయన పడిన ఇబ్బంది గురించి తెలియంది కాదు. కానీ ఇప్పుడు మేమంతా హ్యాపీగా ఉన్నామని తెలిపేలా.. తన తాజా చిత్ర ఫస్ట్ లుక్‌ను రాజశేఖర్ విడుదల చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శేఖర్’. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో, లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. గురువారం రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ప్రియాతి ప్రియమైన, నన్ను ప్రేమించే నా వాళ్లందరికీ, నేను ప్రేమించే నా అభిమానులకు.. అతి భయంకరమైన కొవిడ్-19 నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకువెళ్లినా.. మీ ప్రేమాభిమానాలు, నిరంతర ప్రార్ధనలు నన్ను మళ్లీ, ఈ నా పుట్టినరోజు నాడు ఒక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే స్థితికి తీసుకు వచ్చాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్లైన మీకు, సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను’’ అని అన్నారు.
‘‘రాజశేఖర్‌గారి 91వ చిత్రమిది. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లుక్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రానికి సాంకేతిక వర్గం:
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా),
డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ,
కళ: దత్తాత్రేయ,
రైటర్: లక్ష్మీ భూపాల,
ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని,
సంగీతం: అనూప్ రూబెన్స్,
నిర్మాతలు: ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం,
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లలిత్.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…