Cinema

అల్లు అర్జున్‌ కాబట్టే హిట్టయింది.. నేనైతే ప్లాపయ్యేది: సుమంత్

హీరో సుమంత్‌లో చాలా గొప్ప గుణం ఉంది. అదేంటంటే.. తన వద్దకు వచ్చిన సినిమా ఏదైనా తనకి సెట్‌ కాదని తెలిస్తే.. సగం కథ విన్న వెంటనే.. ఇది మనకు సెట్టవ్వదు అని చెబుతాడట. ఈ విషయంలో స్వయంగా సుమంతే అనేక సార్లు చెప్పాడు. రీసెంట్‌గా కూడా తను హీరోగా నటించిన ‘కపటదారి’ ప్రమోషన్‌లో కూడా మరోసారి ఈ విషయాన్ని ఆయన తెలిపాడు. తనకి సెట్‌ కాని ఆ కథ.. ఏ హీరోకి సెట్‌ అవుతుందో కూడా సుమంత్‌ చెబుతాడట. అంతేకాదు.. ఆ హీరోకి ఫోన్‌ చేసి మరీ కథ వినమని.. తన దగ్గరకు కథ తీసుకువచ్చిన వారిని పంపిస్తాడట. నిజంగా ఇది చాలా గొప్ప గుణం అని ఒప్పుకోవాల్సిందే.

కాకపోతే ఇది గొప్ప గుణమే కానీ.. ఇలా సుమంత్‌ తన వరకు వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాలను కూడా మిస్సయ్యాడు. ముఖ్యంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా ఇప్పటికీ చెప్పుకునే ‘తొలిప్రేమ’ చిత్రం.. ఫస్ట్ సుమంత్ వద్దకే వచ్చింది. ఆ చిత్రం తనకు సెట్‌ అవ్వదని దర్శకుడు కరుణాకరన్‌కి చెప్పి.. పవన్‌ వద్దకు పంపించాడట. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఇలాంటి విషయమే సుమంత్‌ రివీల్‌ చేశాడు. తాజాగా ఆయన రివీల్‌ చేసిన విషయం కూడా మెగా హీరోదే కావడం విశేషం.

డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా రూపొందిన ‘దేశముదురు’ చిత్రం ఫస్ట్ తన వద్దకే వచ్చిందట. పూరీ తనకే కథ చెప్పాడట. కానీ ఆ కథకు తను సెట్‌ కానని చెప్పి.. బన్నీకి ఫోన్‌ చేసి పూరీని పంపించాడట. ఆ చిత్రం బన్నీకి ఎటువంటి హెల్ప్‌ అయ్యిందో.. బన్నీకి ఎటువంటి ఇమేజ్‌ని తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే. నిజంగా ఆ చిత్రం అల్లు అర్జున్‌ చేశాడు కాబట్టే.. అంత పెద్ద హిట్‌ అయ్యింది. అదే నేను చేసి ఉంటే ఖచ్చితంగా ప్లాప్‌ అయ్యేది అని.. సుమంత్‌ రివీల్‌ చేశాడు. నిజంగా అలా చేయడానికి, ఇలా చెప్పడానికి కూడా ఘట్స్‌ ఉండాలి. అందుకే సుమంత్‌ అంటే హీరోలందరూ ఇష్టపడతారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM