David warner posted one more hero video
ఈ మధ్య కాలంలో ఒక క్రికెటర్.. డాన్సర్ గా, యాక్టర్‌గా మారి అందరిని అలరిస్తున్నాడు. అది కూడా మన తెలుగు వాడు కాదు. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఇతనికి మన దక్షిణాది సినిమాలన్నా, హీరోలన్నా మక్కువ ఎక్కువ. ఆ కారణంగానే ఇతను తెలుగు సినిమా హీరోలని ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ లు, యాక్టింగ్ లు చేస్తూ అందర్నీ అలరిస్తున్నాడు. బుట్ట బొమ్మ సాంగ్ కి భార్యతో సహా స్టెప్పులేసి మెప్పించాడు. బాహుబలి సినిమాలోని ప్రభాస్ డైలాగ్ చెప్తూ వీడియో పోస్ట్ చేశాడు. పేస్ ఆఫ్ యాప్ ద్వారా కొంతమంది హీరోల ఫేస్‌లని మార్చి, వారి ఫేస్‌ల స్థానంలో తన ఫేస్ పెట్టి వీరలెవల్‌లో ఇమిటేట్ చేస్తున్నాడు. ఆయన పెట్టిన వీడియోలకు నెటిజన్ల నుంచే కాకుండా.. సదరు హీరోల నుంచి కూడా రిప్లయ్ వస్తుండటం విశేషం.
దీనితో వార్నర్ అంటే.. ఆయన వేరే దేశపు జట్టు సభ్యుడు అయినప్పటికీ.. తెలుగువారు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. అందులోనే ఆయన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక బ్యాట్స్‌మెన్ కూడానూ. మరో విశేషం ఏమిటంటే.. వార్నర్‌తో పాటు వారి పిల్లలు కూడా ఈ వీడియోలలో అప్పుడప్పుడు దర్శనమిస్తూ.. వావ్ అనిపిస్తుంటారు. ఆయన చేసే వీడియోలతో మన టాలీవుడ్ దర్శకులు ఏదైనా సినిమా ప్లాన్ చేసినా చేయవచ్చు అనేలా కూడా వార్తలు నడిచాయి.
వార్నర్ ఇప్పటి వరకు బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్‌తో పాటు మహేష్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్, వంటి వారి చిత్రాల డైలాగ్స్ చెబుతూ వీడియోలు షేర్ చేశాడు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నుంచి కూడా టీజర్ డైలాగ్‌ని రీఫేస్ చేశాడు. ఈ మధ్య మహేష్ బాబు పాల పిట్ట సాంగ్ లో తళుక్కున మెరిశాడు. ఇప్పుడు దళపతి విజయ్ సినిమా ‘మాస్టర్’ నుంచి కూడా ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసి.. ఇది ఏ సినిమాలోదో, యాక్టర్ ఎవరో.. చెప్పి.. వీడియోకి క్యాప్షన్ ఇవ్వండి అని తెలిపారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…