Cinema

‘జ‌న‌తాబార్’ ట్రైలర్ లాంచ్

ప్ర‌ముఖ క‌థానాయిక రాయ్ ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తెలుగు చిత్రం జ‌న‌తాబార్‌. రోచిశ్రీ మూవీస్ ప‌తాక‌పంపై అశ్వ‌థ్‌ నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మ‌ణ  మొగిలి స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు శ‌క్తిక‌పూర్ ఇంపార్టెంట్ పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్రం ట్రైయిల‌ర్ హీరో శ్రీ‌కాంత్ విడుద‌ల చేశాడు.  అన్ని ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మేలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ… కుస్తీ పోటీల నేప‌థ్యంలో న‌డిచే క‌థ ఇది. నేటి స‌మాజంలో స్త్రీ ప్రాధాన్య‌త‌ను చాటి చెప్పే చిత్ర‌మిది. నాలుగు పాట‌లు, ఫైట్స్‌ల‌తో కొన‌సాగే రెగ్యుల‌ర్ చిత్రం కాదు. క‌మ‌ర్షియాల్ అంశాలు వుంటూనే స‌మాజానికి చ‌క్క‌ని సందేశాన్ని మేళ‌వించి రూపొందించిన చిత్ర‌మిది అన్నారు.

క‌థానాయిక ల‌క్ష్మీరాయ్ మాట్లాడుతూ… తెలుగులో మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్న త‌రుణంలో ర‌మ‌ణ మొగిలి చెప్పిన ఈ క‌థ న‌న్ను ఎంతో ఆలోచింప‌జేసింది. ఒక‌వేళ ఈ చిత్రం చేయ‌క‌పోతే నా కెరీర్‌లో ఓ మంచి చిత్రాన్ని కోల్పోయేదాన్ని. న‌న్ను నేను కొత్తగా ఆవిష్క‌రించుకోవ‌డానికి ఈ సినిమా ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఈ చిత్రంలో నా పాత్ర బార్‌గ‌ర్ల్‌గా ప్రారంభ‌మై స‌మాజంలో మ‌హిళ‌లు గొప్ప‌గా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది అనేది ఎంతో ఆస‌క్తిక‌రంగా వుంటుంది అన్నారు. యానిమ‌ల్ త‌రువాత  ఈచిత్రంలో మ‌ళ్లీ ఓ మంచి పాత్ర‌ను చేశాన‌నిన, ఈ సినిమాలో త‌న  పాత్ర  న‌లుగురు చెప్పుకునేంత గొప్ప‌గా వుంటుంద‌ని శ‌క్తిక‌పూర్ తెలిపారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM