ఘనంగా ‘జయం’ ఫస్ట్‌లుక్ లాంచ్ Jayam Movie Grandly First Look Launched
ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…నిర్మాత రవికుమార్ చౌదరి ఇంతకు ముందే 4 సినిమాలు తీసి ఉండటంతో ఆయనకు మంచి అనుభవం ఉందని భావిస్తున్నాను. ‘జయం’ అనే టైటిల్ ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది అన్నారు.
పీపుల్స్‌మీడియా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ…
నిర్మాత చౌదరి గారితో నాకు ముందు నుంచీ పరిచయం ఉంది. మంచి అభిరుచిగల నిర్మాత. ఈ సినిమాకు మంచి కాస్టింగ్, టెక్నీషియన్స్‌ను ఎంచుకున్నారు. తేజ గారి జయం చిత్రం లాగే ఈ జయం కూడా అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నా. నాకు చేతనైన సాయం చేస్తాను అన్నారు.
నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…
స్రవంతి బ్యానర్ ద్వారా రవికిషోర్‌గారు చాలాపెద్ద ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఇప్పుడు ఈ స్రవంతి సినిమా ద్వారా ఈ చిత్ర నిర్మాత రవికుమార్ చౌదరి కూడా పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నా. గతంలో 4 సినిమాలు తీసిన అనుభవం ఈ నిర్మాతది. కాబట్టి ఆయనకు సినిమా మేకింగ్ విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన పనిలేదు. గతంలో తేజ గారు చేసిన జయం ద్వారా ఎంతోమందికి లైఫ్ వచ్చింది. ఈ సినిమాతో కూడా కొందరు కొత్త వారికి లైఫ్ వస్తుందని ఆశిస్తున్నా. చిన్న సినిమాలకు మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది అన్నారు.
చిత్ర నిర్మాత రవికుమార్ చౌదరి మాట్లాడుతూ…
ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థ్యాంక్స్. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఆ జయం లాగే ఈ జయం కూడా అంతే సక్సెస్ అవుతుంది అనిపించింది. మంచి విజన్ ఉన్న దర్శకుడు కిరణ్‌కుమార్. నేను ఇప్పటికే 4 సినిమాలను నిర్మించాను. వాటి ద్వారా 10 మంది హీరోలను పరిచయం చేశాను. ఈ సినిమా అందరికీ పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
దర్శకుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ…
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో, హీరోయిన్‌లు సత్య మేరుగు`దీపిక, దేవరూపం, దసరా ఫేం మోహన్, కుప్పిలి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రేమ్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్ పూర్ణచంద్రశేఖర్‌రావు తదితరులు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రానికి సంగీతం: గౌతమ్ రవిరామ్, ఆర్మాన్ మేరుగు, ఎం. ఐలేష్ కుమార్, డీఓపీ: యుఎస్ విజయ్, కొరియోగ్రఫీ: మోహన్ కృష్ణ, హరి తాటిపల్లి, ఫైట్స్: రాజేష్ లంక, పీఆర్వో: బి. వీరబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రేమ్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: పూర్ణచంద్రశేఖర్‌రావు, నిర్మాత: కంటూరు రవికుమార్ చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి. కిరణ్‌కుమార్.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…