Cinema

ఘనంగా ‘కలియుగం పట్టణంలో’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న  ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను ఘనంగా లాంచ్ చేశారు.
‘వీడు ఉండాల్సింది ఇక్కడ కాదు.. మెంటల్ హాస్పిటల్‌లో’ అంటూ సాగే ఈ ట్రైలర్‌లో యాక్షన్, లవ్, క్రైమ్, థ్రిల్లర్ ఇలా అన్ని అంశాలను చూపించారు. నంద్యాలలో జరిగే హత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. నల్లమల ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను అల్లుకుని కథను రాసినట్టుగా కనిపిస్తోంది.‘ ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదమ్మా’ అని హీరో చెప్పే ఎమోషనల్ డైలాగ్ బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ ఉంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..
నిర్మాతలు కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు మాట్లాడుతూ..* ‘మా కలియుగం పట్టణంలో సినిమా అంతా కూడా కడపలోనే తీశాం. దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాం. మా సినిమా చాలా బాగా వచ్చింది. మా హీరో విశ్వ కార్తికేయ మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఆయుషి పటేల్ పాత్రకు ప్రాణం పోశారు. మా చిత్రం మార్చి 29న విడుదల కానుంది. మా సినిమాను ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘సినిమాలో క్రైమ్ ఉంటుంది. అలా అని స్టూడెంట్స్ దాన్ని ఫాలో అవ్వొద్దు. మా సినిమాకు నిర్మాత నాని గారు ముందు నుంచి సపోర్ట్‌గా నిలిచారు. హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ ఆయుషి పటేల్ అద్భుతంగా నటించారు. మా మూవీ మార్చి 29న రాబోతోంది. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరించాలి’ అని అన్నారు.
విశ్వ కార్తికేయ మాట్లాడుతూ… ‘కలియుగం పట్టణంలో ప్రతీ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో అన్ని జానర్లను ప్రేక్షకులు ఎక్స్‌పీరియెన్స్ చేయబోతున్నారు. ఇది కచ్చితంగా ఓ యూనిక్ పాయింట్. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా కడప ప్రజలు, పోలీసుల నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. మార్చి 29న రాబోతోన్న మా సినిమాను ఆడియెన్స్ ఆదరించి విజయవంతం చేయాలి’ అని అన్నారు.
ఆయుషి పటేల్ మాట్లాడుతూ… ‘మా టీం అంతా కలిసి సినిమా షూటింగ్ ఎంతో సరదాగా చేశాం. కడపలో ఎంతో కంఫర్టబుల్‌గా షూట్ చేశాం. మా హీరో విశ్వ కార్తికేయ ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. విశ్వకు సినిమాలంటే ప్రాణం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. మా సినిమా మార్చి 29న రాబోతోంది. అందరూ ఆదరించండి’ అని అన్నారు.
నటీనటులు :  విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్,  చిత్రా శుక్లా తదితరులు

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM